English | Telugu

నటించటం గురించి పునరాలోచిస్తాను మెగాస్టార్

"నటించటం గురించి పునరాలోచిస్తాను" అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. వివరాల్లోకి వెళితే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, అమితాబ్ హీరోగా, హేమా మాలిని, రవీనా టాండన్, సోనాలీ చౌహాన్, చార్మి కౌర్, సోనూ సూద్, ప్రకాష్ రాజ్ ప్రథాన తారాగణంగా నిర్మించిన చిత్రం"బుడ్డా" హోగా తేరా బాప్. ఈ చిత్రం ప్రీమియర్ షో జూన్ 30 వ తేదీ, రాత్రి హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ లో జరిగింది. ఈ ప్రీమియర్ షోకి ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, దర్శకుడు పూరీ జగన్నాథ్, మెగాస్టార్, పద్మభూషణ్, డాక్టర్ చిరంజీవి, రెబెల్ స్టార్ కృష్ణం రాజు, రామ్ గోపాల వర్మ, రవితేజ, హరిష్ శంకర్ తదితరులు విచ్చేశారు.

ఆ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ " నన్ను మళ్ళీ నటించమని అభిమానులు కోరుతున్నారు. అమితాబ్ జీ కూడా దాని గురించే రిక్వేస్ట్ చేశారు.దానిగురించి ఒక కండిషన్ మీదైతే పునరాలోచిస్తాను. ఆ కండిషన్ ఏమిటంటే అమితాబ్‍ బచ్చన్ గారు ఆ చిత్రంలో గెస్ట్ గా కనిపించేటట్లయితే నేను మళ్ళీ నటించటం గురించి పునరాలోచిస్తాను. నా 150 వ చిత్రానికి పూరీ జగన్నాథ్, 151 వ చిత్రానికి రామ్ గోపాల వర్మ దర్శకత్వం వహిస్తారు. సరేనా " అని అన్నారు. దానికి సమాధానంగా అమితాబ్ బచ్చన్ అలా నటించటానికి తన అంగీకారాన్ని తెలియజేశారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.