English | Telugu

నాలుగు భాషల్లో ఓటిటి కి సిద్ధమవుతున్న రవితేజ.. అసలైన మాస్ జాతర ఇదే  

-నాలుగు భాషల్లో మాస్ జాతర స్టార్ట్
-రవితేజ పెర్ఫార్మెన్స్ హైలెట్
-నెట్ ఫ్లిక్స్ వెల్లడి



మాస్ మహారాజా రవితేజ సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన ప్రీవియస్ మూవీ 'మాస్ జాతర'(Mass Jathara). మాస్ అండ్ కమర్షియల్ అంశాలతో తెరకెక్కగా లక్ష్మణ్ భేరీ అనే రైల్వే పోలీస్ ఆఫీసర్ గా రవితేజ మరోసారి తనదైన పెర్ఫార్మెన్స్ తో విజృంభించాడు. గత నెల అక్టోబర్ 31 న వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో ప్రీమియర్స్ తో అడుగుపెట్టింది. నూతన దర్శకుడు భాను బోగవరపు దర్శకత్వంలో అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్ నిర్మాణ విషయంలో రాజీపడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో మాస్ జాతర ని నిర్మించింది.

ఇప్పుడు ఈ మూవీ ఓటిటి వేదికగా కనువిందు చెయ్యడానికి రెడీ అవుతుంది. ఈ మేరకు ఈ నెల 28 నుంచి నెట్ ఫ్లిక్స్(Netflix)వేదికగా స్ట్రీమింగ్ కి తీసుకొస్తునట్టు సదరు సంస్థ అధికారకంగా ప్రకటించింది. పైగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నారు. దీంతో నాలుగు లాంగ్వేజెస్ ఓటిటి లవర్స్ కి మాస్ జాతర రూపంలో 27 న మంచి సినీ మజా దొరికినట్లే. తులసి అనే క్యారక్టర్ ల రవితేజ సరసన శ్రీలీల(sreleela)కనిపించి కనువిందు చేసింది. ఊహించని విధంగా తన క్యారక్టర్ ఉండటం ఈ చిత్రం స్పెషాలిటీ, శివుడు గా నవీన్ చంద్ర విలనిజం మెప్పించడంతో పాటు రాజేంద్రప్రసాద్, నరేష్, సముద్ర ఖని పోషించిన క్యారెక్టర్స్ మెప్పిస్తాయి.


also read:నువ్వు దేవుడివి స్వామి.. బాలకృష్ణ పై ప్రముఖ ఫైట్ మాస్టర్స్ కీలక వ్యాఖ్యలు


నటీనటుల పెర్ ఫార్మెన్స్ బాగున్నా బాక్స్ ఆఫీస్ వద్ద మాస్ జాతర నెగిటివ్ టాక్ ని తెచ్చుకుంది. రిలీజ్ సందర్భంలో అభిమానులు ప్రేక్షకులు మాట్లాడుతు పాత తరహా కథ, కథనాలతో మూవీ తెరకెక్కిందనే అభిప్రాయాన్ని చెప్పారు. మరి ఇప్పుడు ఓటిటి లవర్స్ ఆదరణ ని ఎంత మేర అందుకుంటుందో చూడాలి.


పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.