English | Telugu
ప్రముఖ దర్శకులు భారతిరాజా కుమారుడు మృతి..ప్రధాన కారణం ఇదే
Updated : Mar 25, 2025
భారతీయ సినిమాకి సరికొత్త కథల్ని,టేకింగ్ ని పరిచయం చేసిన దర్శకుల్లో భారతిరాజా(Bharathiraja)కూడా ఒకరు.పేరుకి తమిళ దర్శకుడే అయినా,ఆయన తమిళంతో పాటుఇతర భాషల్లోను సినిమాలు తెరకెక్కించి నాలుగు దశాబ్డల క్రితమే పాన్ ఇండియా డైరెక్టర్ గా తన హవా కొనసాగించారు.తెలుగులో చిరంజీవితో చేసిన ఆరాధన,కార్తీక్,ముచ్చర్ల అరుణల గ్రేటెస్ట్ లవ్ స్టోరీ సీతాకోక చిలుక,ఎర్రగులాబీలు,టిక్ టిక్ టిక్,జమదగ్ని,కొత్త జీవితాలు,యువతరం పిలిచింది,ఈ తరం ఇల్లాలు వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ.బాలకృష్ణ వన్ ఇయర్ మూవీ మంగమ్మగారి మనవడుకి కథ కూడా భారతి రాజా నే ఇచ్చారు.గత సంవత్సరం విజయ్ సేతుపతి(Vijaysethupathi)తో కలిసి 'మహారాజ'(Maharaja)మూవీలో 'క్షురకుడు' గా నటించి తన సత్తా చాటారు.
భారతి రాజాకి మనోజ్ భారతిరాజా(Manoj bharathiraja)అనే కొడుకు,జనని ఐశ్వర్య అనే కూతురు ఉన్నారు. నిన్న రాత్రి కుమారుడు మనోజ్ భారతీరాజాకి గుండె పోటు రావడంతో చెన్నై లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించి ట్రీట్ మెంట్ చేయిస్తున్నారు.చివరకి పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు.మనోజ్ వయసు 48 సంవత్సరాలు కాగా భార్య నందన ఇద్దరు పిల్లలు ఉన్నారు.తన తండ్రి దర్సకత్వంలో వచ్చిన 'తాజ్ మహల్'మూవీతో తమిళంలో హీరోగా పరిచయమైన మనోజ్ ఆ తర్వాత సముదిరం,అల్లిఅర్జున,పల్లవన్ ఇలా సుమారు 14 చిత్రాల దాకా ప్రాధాన్యత గల పాత్రల్లో నటించారు.చివరిగా 2022 లో 'విరుమన్' అనే చిత్రంలో కనపడ్డాడు. ఒక సినిమాకి కూడా మనోజ్ దర్శకత్వం వహించడం జరిగింది. ఇక మనోజ్ మృతి పట్ల తమిళ చిత్ర సీమతో పాటు దక్షిణ సినీ పరిశ్రమకి చెందిన పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు.