English | Telugu

డబ్బులు తీసుకొని ఓటేయండి.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు!

మంచు మోహన్ బాబు ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ.. ఆయన వ్యాఖ్యలు మాత్రం రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆమధ్య, "హెరిటేజ్ సంస్థ మోహన్ బాబుది అయితే.. చంద్రబాబు మోసం చేసి లాక్కున్నారు" అని పోసాని కృష్ణమురళి ఆరోపించారు. ఆ సమయంలో స్పందించిన మోహన్ బాబు.. తన పేరుతో రాజకీయం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని పరోక్షంగా పోసానిని హెచ్చరించారు. ఇక తాజాగా మరోసారి రాజకీయాల్లో మోహన్ బాబు పేరు తెరపైకి వచ్చింది.

మార్చి 19న మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మోహన్ బాబు యూనివర్సిటీలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు మంచు ఫ్యామిలీతో పాటు మోహన్ లాల్, ముకేశ్ రిషి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. "ఆలోచించి ఓటు వేయండి. ఒక్కోసారి తప్పు చేస్తుంటాం. ఒక పార్టీ మంచిది అనుకొని ఓటేస్తే.. వాళ్ళు తప్పు చేస్తారు. దాంతో ఈసారి మరో పార్టీకి ఓటేస్తాం. ఇలా ఎవరిని నమ్మాలో తెలియదు. అందుకే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఆలోచించుకొని ఓటేయాలి. ప్రాంతీయ పార్టీల గురించి నేను మాట్లాడదలచుకోలేదు. కానీ భారత ప్రధానిగా మళ్ళీ మోడీ గారు వస్తేనే ఈ దేశం బాగుపడుతుంది. ఆయన ఆలోచన విధానం బాగుంటుంది. ఆయన లాంటి వ్యక్తి ఈ దేశానికి కావాలి. మీరు కూడా ఓటేసేముందు ఆలోచించండి. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను. డబ్బులు ఏ పార్టీ వారు ఇచ్చినా తీసుకోండి.. ఎందుకంటే అది ప్రజల సొమ్మే. కానీ ఓటు మాత్రం మనసుకి నచ్చినవారికి వేసి, భారత దేశ భవిష్యత్ కి సహకరించండి" అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

ప్రాంతీయ పార్టీల గురించి మాట్లాడను అంటూనే.. మోడీని ప్రశంసించి పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి ఓటెయ్యాలో మోహన్ బాబు చెప్పినట్లయింది. ఎందుకంటే ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. బీజేపీకి ఓటేయమని చెప్పడమంటే.. పరోక్షంగా టీడీపీ-జనసేన కూటమికి మద్దతు తెలపడమే అవుతుంది. ఆ లెక్కన చూస్తే.. ఇవి ఏపీ అధికార పార్టీ వైసీపీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలుగా కూడా అర్థం చేసుకోవచ్చు.

గత ఎన్నికల్లో మోహన్ బాబు వైసీపీకి మద్దతుగా నిలిచారు. అలాంటి మోహన్ బాబు.. వైసీపీ మద్దతుదారుడైన పోసానికి ఆమధ్య పరోక్షంగా వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. ఇక ఇప్పుడు వైసీపీ ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీతో దోస్తీ చేస్తున్న బీజేపీకి ఓటు వేయమనడం సంచలనంగా మారింది. మొత్తానికి కొంతకాలంగా ఆయన మాటలు గమనిస్తే వైసీపీకి దూరంగా ఉంటున్నారని అర్థమవుతోంది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.