English | Telugu

ఓటీటీలోకి భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!


ఓటీటీ వేదికలపై మాములుగా కంటెంట్ ఉన్న సినిమాలకే మంచి వీక్షకాధరణ లభిస్తోంది. అటువంటిది భారీ యాక్షన్ థ్రిల్లర్ వస్తుందంటే ఇంక ఓటీటీ లవర్స్ కి పండగే అని చెప్పాలి.

కొన్ని నెలల క్రితం రిలీజ్ అయి మంచి వీక్షకాధరణ లభించిన వాటిల్లో ది రైల్వే మెన్, రానా నాయుడు, ఫర్జీ, ఫ్యామిలీ మ్యాన్ ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో #90's వెబ్ సిరీస్, ది కేరళ స్టోరీస్ లాంటి కథలు ఎవరి ఊహకి అందకుండా క్లిక్ అయ్యాయి. అలాగే మలయాళం సినిమా భ్రమయుగం లాంటి వైవిద్యమైన ‌కథలు తెలుగు ప్రేక్షకులకి నచ్చుతున్నాయి. ఇక తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజైన సేవ్ ది టైగర్స్-2 కూడా హిట్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. ఆయితే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ వేదికగా ' రెబల్ మూన్- పార్ట్ 2 : ది స్కార్ గివర్.. ఏప్రిల్ 19 న నేరుగా ఓటీటీలోకి విడుదల కానుంది. హాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ జాక్ స్నైడర్ తెరకెక్కించిన రెబల్ మూన్ పార్ట్ 1 గతేడాది డైరెక్ట్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. అప్పట్లో ఈ సినిమా భారీ హిట్ సొంతం చేసుకుంది. పార్ట్ వన్ హిట్ అవ్వడంతో పార్ట్ 2 ని తీసుకొస్తున్నారు డైరెక్టర్ జాక్‌ స్నైడర్.

300, మ్యాన్ ఆఫ్ స్టీల్, బ్యాట్ మ్యాన్ వర్సెస్ సూపర్‌ మ్యాన్, జస్టిస్ లీగ్ , డాన్ ఆఫ్ ది డెడ్ లాంటి‌ ఎన్నో హిట్ సినిమాలని జాక్ స్నైడర్ అందించారు. పార్ట్ వన్ మాదిరి ఈ సెకెండ్ పార్ట్ ని కూడా నెట్ ఫ్లిక్స్ లోనే డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్,మలయాళం, హిందీ, ‌ఇంగ్లీష్ తో పాటు కన్నడలో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంటుందని మేకర్స్ ఓ ప్రకటనలో‌ తెలిపారు. మరి మీలో ఎంతమంది ' రెబల్ మూన్ - 1 ' చూశారు. ఒకవేళ చూడకపోతే పార్ట్-2 వచ్చేలోపే చూసేయండి. ఈ సినిమాలో సోఫియా బౌటెల్లా, ఎడ్ స్క్రీన్, మైఖెల్ హ్యూస్ మన్ , ఛార్లీ హున్నామ్, షార్లట్ మాగీ తదితరులు నటించారు. ఈ సినిమాలో ఎటువంటి అడల్ట్ సీన్స్ లేనందున ఫ్యామిలీతో‌ కలిసి చూడొచ్చని.. సైన్స్ ఫిక్షన్ లోని థ్రిల్ ని ఆస్వాదించొచ్చని మేకర్స్ తెలిపారు. మరి మీలో ఎంతమంది ఈ సినిమా చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.