Read more!

English | Telugu

మంచు మనోజ్ భార్య డెలివరీ..నిక్ నేమ్ పెట్టామని మంచు లక్ష్మి ట్వీట్


ఇటీవల ప్రముఖ హీరో  మంచు మనోజ్ భార్య మౌనిక తల్లి అయిన విషయం అందరకి తెలిసిందే.  శ్రీమంతం కూడా  ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. కొద్దిసేపటి క్రితమే మౌనిక డెలివరీ అయ్యింది.

మౌనిక పండంటి ఆడపిల్లని ప్రసవించింది. ఈ విషయాన్ని మనోజ్ సోదరి ప్రముఖ నటి మంచు లక్ష్మి తన ట్విట్టర్ వేదికగా తెలియచేసింది. మా ఇంట్లోకి దేవత వచ్చింది. అన్నయ్య, వదిన లు చాలా సంతోషిస్తున్నారు. అన్నగా ధైరవ్ కూడా ఎంతో ఆనందంతో ఉన్నాడు. అప్పుడే పాపకి నిక్ నేమ్ కూడా పెట్టారని మా కుటుంబంపై శివయ్య ఆశీస్సులు  ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నానని తెలిపింది. మనోజ్, మౌనిక లకి పలువురు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.2023 మార్చి నెలలో ఆ ఇద్దరి  వివాహం జరిగింది