Read more!

English | Telugu

అటాక్ బాలేదని ఒప్పుకున్న మంచు మనోజ్..!

సినిమా చిన్నదైనా, పెద్దదైనా అందులో నటించేవాళ్లు ఒకేలా కష్టపడతారు. కానీ ఫలితాలు వాళ్ల కష్టాన్ని తప్పుగా చూపిస్తుంటాయి. హిట్టైన సినిమాలో, యాక్టింగ్ సోసో గా ఉన్నా అబ్బో చాలా బాగా నటించారు అని కితాబిస్తారు. ఫ్లాపైతే, ఎంత కష్టపడి నటించినా, అదంతా కనుమరుగైపోతుంది. కనీసం జనానికి గుర్తు కూడా ఉండదు. శంకర్ తీసిన ఐ సినిమాయే ఇందుకు ఉదాహరణ. రిలీజయ్యే వరకూ విక్రమ్ గురించి బాగానే అందరూ మోసేసినా, ఫ్లాప్ టాక్ వచ్చిన తర్వాత, విక్రమ్ కష్టం ఎవరికీ గుర్తే లేదు. ఈ ఫ్యాక్ట్ ను మంచు మనోజ్ త్వరగానే గుర్తించాడు.

నిన్న రిలీజైన మనోజ్ అటాక్ సినిమా అట్టర్ ఫ్లాప్ అని రివ్యూలు వచ్చాయి. సినిమా మరీ ఘోరంగా ఉందంటూ చాలా రివ్యూలు తిట్టి పోశాయి కూడా. కానీ మనోజ్ చాలా గౌరవంగా వాటన్నింటినీ స్వీకరించాడు. తన ట్వీట్ లో, ఫలితం మన చేతిలో లేదు. కష్టపడటమే మన బాధ్యత అంటూ సినిమాలో తనవరకూ తప్పులేకుండా కష్టపడ్డాననన్న విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు. అంతేకాదు, రివ్యూలతో నేను ఏకీభవిస్తున్నాను అంటూ సినిమా బాలేదని ఒప్పేసుకున్నాడు. సినిమా పోయినా మంచు మనోజ్ యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు తన తాజా ట్వీట్ తో, గౌరవాన్ని కూడా సంపాదించుకున్నాడు మంచు మనోజ్.