English | Telugu
బ్లూ ఫిల్మ్ తీసి మెసేజ్ ఇస్తే సరిపోతుందా?
Updated : Jun 11, 2023
మహి వి రాఘవ్.. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న డైరెక్టర్. 'ఆనందో బ్రహ్మ', 'యాత్ర' వంటి సినిమాలతో దర్శకుడిగా ఆకట్టుకున్న ఆయన.. రీసెంట్ గా 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయిన 'సేవ్ ది టైగర్స్' వెబ్ సిరీస్ తో క్రియేటర్ గా మరింత గుర్తింపు పొందారు. కాగా మహి వి రాఘవ్ డైరెక్ట్ చేసిన 'సైతాన్' వెబ్ సిరీస్ మరి కొన్ని రోజుల్లో ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దీని ట్రైలర్ విడుదలైంది. అయితే అందులో బోల్డ్ డైలాగ్స్ ఉండడంతో పలువురు విమర్శిస్తున్నారు. కాగా తెలుగువన్ తో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సిరీస్ కి సంబంధించిన విషయాలను పంచుకున్నారు మహి వి రాఘవ్.
'విలేజ్ లో వినాయకుడు' మూవీతో ప్రొడ్యూసర్ గా మహి వి రాఘవ్ పరిచయమయ్యారు. ఆ తర్వాత 2014 లో విడుదలైన 'పాఠశాల' మూవీకి డైరెక్టర్ గా చేసి విమర్శకుల ప్రశంసలు పొందారు. తాప్సీ పన్ను కథానాయికగా 2017 లో రిలీజ్ అయిన 'ఆనందో బ్రహ్మ' , 2019 లో 'యాత్ర' లాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలని డైరెక్ట్ చేసాడు మహి వి రాఘవ్. అయితే ఓటీటీలో తాజాగా రిలీజైన 'సేవ్ ది టైగర్స్' సిరీస్ ని కామెడీ జానర్ లో ఫ్యామిలీతో కలిసి చూసేలా క్రియేట్ చేసిన మహి వి రాఘవ్.. ఇప్పుడు వస్తోన్న 'సైతాన్'ని ఒంటరిగానే చూడాలని చెప్తున్నారు.
ఇంటర్వ్యూలో బ్లూ ఫిల్మ్ తీసి మెసేజ్ ఇస్తే సరిపోతుందా అని అడుగగా.. నెల రోజుల క్రితం నేనే 'సేవ్ ది టైగర్స్' తీసాను. అప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి చూసారు. ఇప్పుడు ముందుగానే చెప్తున్నాం. ఇందులో బోల్డ్ కంటెంట్ ఉంది. వన్ టూ వన్ చూడాలి. ఫ్యామిలీతో కలిసి చూసేది కాదని మహి వి రాఘవ్ చెప్పారు. "ఒక రకమైన పాత్ లో వెళుతున్న మహి వి రాఘవ్.. సడన్ గా ఈ క్రైమ్ వరల్డ్ లోకి ఎందుకు వచ్చాడు? దానికేమైనా హంటింగ్ పాయింట్ ఉందా" అని అడుగగా.. "అదేం లేదండి.. నాకు తెలియంది నేను ఎక్ప్పీరియన్స్ చేయాలని ఒక క్యూరియాసిటి అంతే.. రెగ్యులర్ గా ఉండాలని లేదు. నాకు ఛాలెంజింగా ఉండాలి. ముందు ఆ కథని ఒక రెండేళ్ళు నేను భరించాలి. నేను హర్రర్ సినిమాలు చూడను కానీ హర్రర్ సినిమా తీశాను. నాకు తెలియని ప్రపంచాన్ని నా సినిమాలో చూపించడం నాకు ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది" అని మహి వి రాఘవ్ చెప్పారు. తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకా పలు ఆసక్తికరమైన విషయాలని షేర్ చేసుకున్నారు మహి వి రాఘవ.