Read more!

English | Telugu

మహేష్ పోకిరీకి పదేళ్లు వచ్చేశాయి..!

మహేష్ బాబుకే కాక, తెలుగు సినిమాకు కూడా ఒక మైల్ స్టోన్ గా నిలబడిపోయే సినిమా పోకిరి. సినిమా పరంగా చాలా చాలా సింపుల్ కంటెంట్. కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ లో పూరీ డైరెక్టర్ గా తన మార్క్ చూపించాడు. అప్పటి వరకూ చిన్న సినిమాల డైరెక్టర్ గా ఉన్న పూరీని ఒక్కసారిగా టాప్ లీగ్ లో కూర్చోపెట్టిన సినిమా ఇది. మహేష్ కెరీర్ కు పూర్తి మాస్ కిక్ ఇచ్చిన సినిమా ఇది. ఏప్రిల్ 28, 2006. పోకిరి రీలీజ్ డేట్. ఆ రోజున విడుదలైన పోకిరీ, ఆంధ్రప్రదేశ్ లో ప్రభంజనం సృష్టించింది. పండు గాడి దెబ్బ రికార్డులు బద్ధలైపోయాయి. బాక్సాఫీస్ కు దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అయింది. 200 సెంటర్లలో 100 రోజులు, 40 కోట్ల షేర్ సాధించిన మొదటి తెలుగు సినిమా పోకిరి. సినిమా క్యాస్టింగ్ నుంచి ఎండ్ టైటిల్స్ పడే వరకూ పూర్తి ఫెర్ఫెక్షన్ తో కనబడే సినిమా ఇది. ఎవరెవరు ఏ పాత్రకు సెట్ అవుతారో, అలా కుదిరిపోయారంతే. ప్రిన్స్ మహేష్ లెవెల్ సూపర్ స్టార్ మహేష్ గా మార్చింది పోకిరి అంటే ఆశ్చర్యం లేదు. ఇలియానాకు హీరోయిన్ గా లైఫ్ ఇచ్చిందీ సినిమా. ఇక మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్ సినిమాను మరో రేంజ్ కు తీసుకెళ్లింది. సినిమాలో అన్నింటి కంటే ఫ్యామస్ డైలాగులే. ఇప్పటికీ జనాల నోట్లో నానే డైలాగ్స్ ను ఓ లుక్కేద్దాం ఛలో..

1. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోద్దో, ఆడే పండుగాడు..!

2. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా..బుల్లెట్టు దిగిందా లేదా..!

3. సినిమాలు చూడట్లేదేటి..?

4. క్యారియర్లు క్యారియర్లు పట్టుకుని ఓ తిరుగుతుంటావు తప్ప, ఏనాడైనా పెట్టావా ఏమన్నా..

5. ఫ్యామిలీ అంతా ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్నా..

6. టైల్స్ ఏస్తన్నారంటగా..శృతి నాదే, రివాల్వరూ నాదే. ఎప్పుడిస్తున్నావ్ రివాల్వర్..?