Read more!

English | Telugu

బ్రహ్మోత్సవం మోషన్ పోస్టర్ రిలీజయ్యింది..!

సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం మోషన్ పోస్టర్ ను తన ట్విట్టర్లో రిలీజ్ చేశారు. పొడవాటి బైక్ ను నడుపుతూ వెళ్తున్న మోషన్ పోస్టర్ ను మూవీ టీం డిజైన్ చేశారు. ఇప్పటికే షూటింగ్ చివరికి వచ్చేసిన బ్రహ్మోత్సవం ఆడియోను మే 7 న శిల్పకళావేదికలో చేయనున్న సంగతి తెలిసిందే. తన ట్విట్టర్లో ఈ రోజు ఉదయం బ్రహ్మోత్సవం బిగిన్స్ అన్న హ్యాష్ ట్యాగ్ తో తన సినిమా మోషన్ పోస్టర్ ను ట్వీట్ చేశారు. ఇప్పటి వరకూ చిన్న టీజర్, మహేష్ చెప్పులు తొడుగుతున్న పోస్టర్ తప్ప మరేమీ రిలీజ్ చేయకుండా సస్పెన్స్ మెయింటెయిన్ చేశారు శ్రీకాంత్ అడ్డాల అండ్ కో. ఆడియో రిలీజ్ తో స్టార్ట్ చేసి, ఇక అప్పటి నుంచి వరసగా మూవీ ప్రమోషన్ల జోరు పెంచబోతున్నారట. తెలుగు తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న బ్రహ్మోత్సవంలో కాజల్, సమంత, ప్రణీత మహేష్ సరసన సందడి చేయబోతున్నారు. క్షణం, ఊపిరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన పివిపీ బ్యానర్, బ్రహ్మోత్సవంతో హ్యాట్రిక్ అందుకోవాలని చూస్తోంది. ఈ సమ్మర్లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా బ్రహ్మాత్సవానికి మంచి అంచనాలుండటం విశేషం.