English | Telugu

మహేష్ బాబు దెబ్బకి కొండా సురేఖలో కలవరపాటు! మినిస్టర్ పదవికి గండం వచ్చిందా!

 

తన రాజకీయ కక్షలకి అణ్యం పుణ్యం ఎరుగని సినిమా పరిశ్రమకి చెందిన అక్కినేని నాగార్జున కుటుంబం, సమంత మీద అత్యంత జుగుప్స కలిగించే విధంగా మాట్లాడిన తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పై పలువురు సినీ ప్రముఖులు ప్రముఖులు మండిపడుతున్నారు. 

ఈ మేరకు తాజాగా మహేష్ బాబు(mahesh babu)కూడా 'ఎక్స్ ' వేదికగా  ఒక ట్వీట్ చేసాడు.మంత్రి కొండా సురేఖ(konda surekha)గారు మా సినీ ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయి. ఒక కూతురికి తండ్రిగా, భార్యకు భర్తగా, తల్లికి కొడుకుగా,ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మహిళా మంత్రి మరో మహిళపై చేసిన ఆమోదయోగ్యంకాని వ్యాఖ్యలు, భాష పట్ల తీవ్ర వేదనకు గురయ్యాను. ఎదుటివారి మనోభావాలను దెబ్బతీయనంత వరకు వాక్‌ స్వతంత్ర స్వేచ్ఛను  ఉపయోగించుకోవచ్చు. కానీ  పేరుతో ఆమె చేసిన చౌకబారు మరియు నిరాధారమైన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, మరియు సినీ వర్గాన్ని సాఫ్ట్ టార్గెట్‌గా మార్చుకోవద్దని పబ్లిక్ డొమైన్‌లోని వ్యక్తులను అభ్యర్థిస్తున్నాను. మన దేశంలోని మహిళలను మరియు మన సినీ సోదరులను చాలా గౌరవంగా చూడాలని ట్వీట్ లో పేర్కొన్నాడు.

 

ఇప్పటికే సురేఖ ఈ విషయంలో అక్కినేని కుటుంబానికి సమంత(samantha)కి క్షమాపణలు చెప్పినప్పటికీ ఆమె చేసిన వ్యాఖ్యలు క్షమార్హం కాని విధంగా ఉన్నాయనే అభిప్రాయం అందరిలోను వ్యక్తం అవుతుంది.ఇక సినీ పరిశ్రమకే చెందిన చిరంజీవి(chiranjeevi)ఎన్టీఆర్(ntr)నాని(nani)మంచు మనోజ్, విష్ణు,తో పాటు ఎంటైర్ తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం అక్కినేని కుటుంబానికి అండగా ట్వీట్లు కూడా చేసింది.అంతే కాకుండా టోటల్ ఇండస్ట్రీ మొత్తం  విషయాన్నీ చాలా ప్రెస్టేజియస్ట్ గా తీసుకున్నట్టుగా ఉందనే వార్తలు వస్తున్నాయి.అమల అయితే ఏకంగా కొండా సురేఖ మీద కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసింది. దీంతో సురేఖ పదవికి గండం వాటిల్లుతోందేమో అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతు ఉంది.