English | Telugu

ఆరునెలల బుడ్డోడప్పుడే పవన్ కళ్యాణ్ కత్తి పట్టుకున్నాడంటా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)ప్రస్తుతం తిరుమల తిరుపతి శ్రీ ఏడుకొండల వాడి సన్నిధిలో ఉన్నాడు.శ్రీవారి దివ్య ప్రసాదమైన లడ్డులో కల్తీ జరిగిందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్న పవన్ ఈ మేరకు నిన్న దీక్షా విరమణ గావించాడు. అలాగే ఈ రోజు  తిరుపతిలోనే తమ అభిమానులని పార్టీ కార్యకర్తలని ఉద్దేశించి ప్రసగించనున్నాడు.ఈ నేపథ్యంలో  పవన్ ఏం మాట్లాతాడనే ఆసక్తి అందరిలో ఉంది.

కానీ అంత కంటే ముందే పవన్ గురించి ఆయన తల్లి అంజనాదేవి(anjana devi)చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు అభిమానుల్లో జోష్ ని తీసుకొస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె పవన్ గురించి మాట్లాడుతు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం అవ్వడానికి పది సంవత్సరాల నుంచి నిత్యం ప్రజలతోనే ఉంటూ ఎండనక వాననకా చాలా కష్ట పడ్డాడు. అందుకే భగవంతుడు ప్రజలకి సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించాడు.పదవి లేనప్పటి కంటే ఇప్పుడు ఇంకా బాగా కష్టపడాలి.చిన్నప్పట్నుంచి కూడా తన కష్టాన్ని మాతో సహా ఎవరకి చెప్పేవాడు కాదు. నాకిది కావాలని కూడా అడిగేవాడు కాదు. చాలా సైలెంట్ గా ఉండే వాడు. భోజనానికి రమ్మంటే కూడా వచ్చే వాడు కాదని చెప్పింది.

 

పవన్ తీసుకున్న ప్రాయశ్చిత్త దీక్ష పై కూడా స్పందిస్తూ ఆ దీక్ష చెయ్యడం చాలా అదృష్టం.చిన్నప్పటి  నుంచి కూడా పవన్ కి దీక్షలు తీసుకోవడం అంటే చాలా ఇష్టం. అయ్యప్ప మాలలు కూడా తీసుకునే వాడు.మేమంతా ఒకసారి  తిరుపతి దర్శనానికి వెళ్ళాం.అప్పుడు పవన్ కి  ఆరు నెలలు వచ్చాయి. దీంతో తిరుపతిలోనే ఉన్న యోగ నరసింహ స్వామి గుడిలోనే అప్పటికప్పుడు  పవన్ కి అన్న ప్రాసన నిర్వహించాం.అప్పుడు పవన్ ముందు  కత్తి, పెన్ను, స్వామి వారి ప్రసాదాన్ని ఉంచితే పవన్ కత్తి పట్టుకున్నాడు. ప్రజలకి సేవ చేయడం కోసం ఎంత వరకైనా వెళ్తాడని అప్పుడే  అనుకున్నానని చెప్పుకొచ్చింది.