Read more!

English | Telugu

మహేష్ బ్రహ్మోత్సవానికి భారీ ప్రీ రిలీజ్ బిజినెస్..!

బ్రహ్మోత్సవం సినిమాపై సూపర్ స్టార్ అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. హాట్ సమ్మర్లో కూల్ సినిమా అంటూనే, దానికి తగ్గట్టు మంచి ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ సినిమాగా పోస్టర్లు రిలీజ్ చేయడమే అందుక్కారణం. కుటుంబకథాచిత్రాల్ని అద్భుతంగా తెరకెక్కిస్తాడని శ్రీకాంత్ అడ్డాల కు ఉన్న పేరు, మహేష్-శ్రీకాంత్ కాంబోలో వచ్చిన సీతమ్మ వాకిట్లో భారీ హిట్ కావడం లాంటివన్నీ కూడా సినిమాకు పాజిటివ్ బజ్ రావడంలో తోడ్పడ్డాయి. అయితే ఇదే బజ్ కారణంగా, సినిమాకు భారీ ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిందంటున్నాయి మూవీ వర్గాలు. ఇప్పటి వరకూ వరల్డ్ వైడ్ రైట్ కలుపుకుని 72 కోట్లకు సినిమాను అమ్మారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం, సినిమా అతి భారీగా కలెక్ట్ చేస్తే తప్ప, రికవరీ కష్టమవుతుంది. ఇంకా ఆడియో, డబ్బింగ్, శాటిలైట్ రైట్స్ కలుపుకుంటే, సినిమా బిజినెస్ వందను టచ్ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. కానీ సినిమా అంత ఎమౌంట్ ను రికవరీ చేస్తుందా అన్నదే అసలు ప్రశ్న. మహేష్, శ్రీకాంత్ అడ్డాల సినిమాలకు ఓవర్సీస్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. కాబట్టి అక్కడ ఎక్కువగా రికవర్ చేసే అవకాశం ఉంది. ఇక సినిమాకు హిట్ టాక్ వచ్చిందంటే, పోటీ లేకుండానే సమ్మర్ అంతా బ్రహ్మోత్సవం కుమ్మేసుకోవచ్చు. శ్రీమంతుడుతో ఫామ్ లోకి వచ్చిన మహేష్, అదే కలెక్షన్ స్థాయిని ఈ సినిమాతో కంటిన్యూ చేస్తాడేమో చూడాలి.