Read more!

English | Telugu

పవన్ పై త్రివిక్రమ్ చెప్పిన కవిత్వం ఇదే..!

అ..ఆ ఆడియో ఫంక్షన్లో, త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ల మధ్య ఉన్న స్నేహం మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. ఇద్దరూ, ఒకరిపై మరొకరు ప్రశంసల వర్షం కురిపించారు. త్రివిక్రమ్ అయితే, తన స్పీచ్ పూర్తైపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ కు మైక్ ఇచ్చేముందు తనే మైక్ తీసుకుని, పవన్ గురించి కవిత్వం చెప్పారు. ఆశువుగా చెప్పారో, లేక ముందే ప్రిపేర్ అయ్యారో తెలీదు కానీ, ఆయన ఒక్కో లైన్ పూర్తి చేసిన ప్రతీసారీ అక్కడున్న పవన్ ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్ వచ్చింది. త్రివిక్రమ్ చెప్పిన వచన కవిత్వం ఇదే..

కొండ ఒకరికి తలొంచి ఎరుగదు...
శిఖరం ఒకరికి సలాం అని ఎరుగదు..
కెరటం అలసి పోయి ఒకరికోసం ఎప్పుడూ ఆగదు..
తుఫాన్ ఒకడి ముందు తలొంచి ఎరుగదు...
నాకిష్టమైన స్నేహితుడు... నా సునామీ... నా ఉప్పెన..
నేను దాచుకున్న నా సైన్యం...
నేను శత్రువు మీద చేసే యుద్ధం...
నేను ఎక్కు పెట్టిన బాణం...
నా పిడికిట్లో ఉన్న వజ్రాయుధం...
నా ఆశల ఆకాశంలో ఉన్న పిడుగు..
ఎంతో మంది గుండెలు తడపడానికి వచ్చిన ఒక చిన్న వర్షపు చినుకు..
స్నేహ రుతుపవనం పవన్ కళ్యాణ్
వెనకాలే వస్తారా...తోడుగా ఉందాం వస్తారా

చివరిగా, వెనకాలే వస్తారా..? తోడుగా ఉంటారా..? తోడుగా ఉందాం వస్తారా అంటూ పవన్ రాజకీయ ప్రస్థానాన్ని ఉద్దేశిస్తూ త్రివిక్రమ్ ముగించడం విశేషం..