English | Telugu

శ్రీమంతుడిని ఇలా వాడుతున్నారు

ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలి.. ఈ విషయం వ్యాపారస్తులకు, కంపెనీలకు తెలిసినట్లుగా ఎవరికీ తెలీదు. ప్రచారం కోసం నటులను ఉపయోగించుకోవడం, ఒప్పందాలు చేసుకోవడం సాధారణంగా జరిగేదే. లేటెస్ట్ జనరేషన్‌లో మార్కెటింగ్ కోసం నయా టెక్నిక్స్ పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు ఓ క్యాబ్ ఆపరేటర్ కంపెనీ కొత్త స్కెచ్ వేసింది ప్రచారం కోసం.

ఇప్పుడు తెలుగు జనాలు ఎక్కువ మాట్లాడుకుంటున్నది శ్రీమంతుడి గురించే. అందుకే మహేష్ బాబు క్రేజ్ వాడుకుని అటు సినిమాకి, ఇటు తమ కంపెనీకి పబ్లిసిటీ చేస్తోంది యుబెర్ క్యాబ్స్. ఈ రోజు ఓ రెండు గంటల పాటు యుబెర్ యాప్‌‌లో శ్రీమంతుడు ఆప్షన్ పై రిజిస్టర్ చేసుకోవాలని చెప్పింది. ఇలా రిజిస్టర్ చేసుకున్నవాళ్లకి శ్రీమంతుడి టీంతో స్పెషల్ చిట్ చాట్ ఏర్పాటు చేస్తారట. అది కూడా సీక్రెట్ ప్లేస్ లో. ఈ కార్యక్రమంలో మహేష్ తో పాటు.. శృతి కూడా పాల్గొననుంది. దీని కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదని చెప్పడం హైలైట్.

అయితే.. మహేష్ తో కలిసే ఛాన్స్ అంటే.. లక్షల కొద్దీ రిజిస్ట్రేషన్స్ రావడం ఖాయం. కానీ ఇందులో 15మందికే లక్కీ ఛాన్స్ దక్కేది. మొత్తం మీద మహేష్ బాబును అడ్డం పెట్టుకుని, ఒకేసారి రెండు రకాల ప్రమోషన్స్.. ఐడియా అదుర్స్ కదూ.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.