English | Telugu

భార్య బర్త్ డే మరచిన ప్రిన్స్

భార్య బర్త్ డే మరచిన ప్రిన్స్. వివరాల్లోకి వెళితే ప్రముఖ తెలుగు హీరో ప్రిన్స్ మహేష్ బాబు తన సహనటి నమ్రతా శిరోడ్కర్ ని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అలా ప్రేమ వివాహం చేసుకున్న మహేష్ బాబు తన భార్య జన్మదినం కూడా మరచిపోయాడట. దానికి కారణం "బిజినెస్ మ్యాన్" చిత్రం అంటే ఆశ్చర్యం కలుగక మానదు.

అంటే "బిజినెస్ మ్యాన్" చిత్రం ప్రమోషన్ లో ఉండి తన భార్య నమ్రతా శిరోడ్కర్ బర్త్ డేని కూడా మరచిపోయాడట హీరో మహేష్ బాబు. దీనికి అతని భార్య కోపగించుకోలేదు సరికదా వృత్తి పట్ల తన భర్త అంకితభావానికి మెచ్చుకుందట. అందుకేనేమో "బిజినెస్ మ్యాన్" చిత్రం అంత పెద్ద హిట్టయ్యింది. కలెక్షన్ల పర్వంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. దటీజ్ మహేష్ బాబు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.