English | Telugu

ఒక్కడు, 300 ఒకేచోట కలిస్తే !!!


ప్రిన్స్‌, ప్రిన్స్‌ని కలిస్తే ఎలా వుంటుంది!! ఇదిగో ఇలా చూడముచ్చటగా ఉంటుంది.

టాలీవుడ్ ప్రిన్స్ హాలీవుడ్ జెరార్డ్ బట్లర్ (కింగ్ లియోనిడాస్)ఇటీవల ఒక ఎయిర్‌పోర్ట్‌లో కలుసుకున్నారు. ఇద్దరు ప్రిన్స్‌లు ఒకరినొకరు పలకరించుకున్నారు. మురిపెంగా నవ్వుకున్నారు. 300 చిత్రంలో స్పార్టా కింగ్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జెరార్డ్, ఇండియన్ మోస్ట్ డిజైరబుల్ 1 మహేష్ ని ఒకే చోట ఇలా చూసిన వాళ్లు మురిసిపోయారు. సో 1 మీట్స్ 300 షార్ట్ ఆండ్ స్వీట్ మెమరీ ఫర్ ఫ్యాన్స్. ఫోటోలోనే ఇంత ముచ్చటగా ఉన్న వీరు కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే ఇంకా ఎంత బాగుండో అని అనిపిస్తుంది కదా...

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.