English | Telugu
మాడ్ స్క్వేర్ ఫస్ట్ రివ్యూ..ఒక్కటి తక్కువయ్యింది!
Updated : Mar 25, 2025
నార్నేనితిన్(Narne Nithin)సంగీత్ శోభన్(Sangeeth Shobhan)రామ్ నితిన్,విష్ణు,ప్రియాంక జువాల్కర్(Priyanka jawalkar)త్రయంలో 2023 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'మాడ్'.యూత్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా మంచి విజయాన్నే నమోదు చేసింది.దీంతో ఈ నెల 28 న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతున్న మాడ్ సీక్వెల్'మాడ్ స్క్వేర్' పై అందరిలోను భారీ అంచనాలున్నాయి.రీసెంట్ గా 'మాడ్ స్క్వేర్’కి సెన్సార్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇదేనంటు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో ప్రేక్షకులకి 'మాడ్' ని మించిన ఎంటర్ టైన్ మెంట్ 'మాడ్ స్క్వేర్' ద్వారా దొరకడం ఖాయం.మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ కార్డు వరకు ఎక్కడా కూడా ఈ ఫ్లో మిస్ అవ్వకుండా సాగిందని,సీక్వెల్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని సెన్సార్ వాళ్ళు అంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.సెకండ్ పార్ట్ అంతా లడ్డు పెళ్లి చుట్టూ తిరుగుతుంది.ఆ పెళ్లి కోసం అందరూ కలిసి గోవాకు వెళ్తారు.అక్కడ ఏం జరిగింది అనేది అసలు కథ అని కాకపోతే రన్ టైం 2 గంటల 10 నిమిషాలే ఉందని,మరో 20 నిమిషాలు నిడివి ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని కూడా సెన్సార్ వాళ్ళు వ్యక్తం చేసారని కూడా అంటున్నారు.మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్నఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో సినిమా రిలీజ్ అయ్యాక కానీ తెలియదు.ఆల్రెడీ యూనిట్ కూడా పొట్ట చెక్కలయ్యే ఎంటర్టైన్మెంట్ ఖాయమని ప్రమోషన్స్ లో చెప్తున్న విషయం తెలిసిందే.
మాడ్ స్క్వేర్ కి భీమ్స్ సిసిరోలియో(Bheems ceciroleo)సంగీతాన్ని అందించగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని థమన్(Thaman)అందించాడు.మొదటి భాగాన్ని నిర్మించిన సితార ఎంటర్ టైన్ మెంట్ నే ఈ చిత్రాన్నికూడా నిర్మించింది.కళ్యాణ్ శంకర్(Kalyan Shankar)దర్శకత్వం వహించాడు.