Read more!

English | Telugu

రెడీ ఫర్ రిలీజ్ లండన్ లైఫ్


 

అసద్ షాన్, యాంబర్ రోజ్ ప్రధాన పాత్రల్లో నవీన్ మేడారం దర్శకత్వంలో రూపొందించిన సినిమా 'లండన్ లైఫ్'. లండన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 12న విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సందర్భంగా.. దర్శకుడు నవీన్ మేడారం మాట్లాడుతూ.. ''హాలీవుడ్ లో సుమారుగా ముప్పై సినిమాలకు పని చేశాను. ఆ అనుభవంతో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాను. ఇండియా నుండి లండన్ వెళ్ళిన తొమ్మిది మంది అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో వాళ్ళకు ఎదురైన సంఘటనలను సినిమాగా రూపొందించాం. పూర్తిగా లండన్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ కథ మొత్తం ఇంగ్లీష్ లోనే ఉంటుంది. అభిషేక్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 12న హైదరాబాద్ లో రిలీజ్ చేస్తున్నాం. లండన్, అమెరికాలలో కె.వి పిక్చర్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. ఐ.టి ఉద్యోగులు, ఫారెన్ లో చదువుకునే స్టూడెంట్స్ ను టార్గెట్ చేసి ఈ సినిమా చేశాం. సిద్ధార్థ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మంచి రొమాంటిక్ కామెడీ ఫిలిం ఇది'' అని చెప్పారు.

కాళి సుదీర్ మాట్లాడుతూ.. ''టాలెంట్ ఉండి మంచి దారి తెలియక చాలా మంది ఉన్నారు. చిన్న సినిమాలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి అంగీకరించాం. నవీన్ మేకింగ్ చాలా బావుంది. సినిమాలో మంచి ఎమోషనల్ లవ్ స్టొరీ ఉంది'' అని చెప్పారు.