Read more!

English | Telugu

పెళ్లికూతురైన చిరంజీవి కూతురు


 

చిరంజీవి ఇంట పెళ్లిసందడి మొదలైంది. ఆయన చిన్న కూతురు శ్రీజను పెళ్లికూతుర్ని చేసే ఫంక్షన్ హడావిడి జరుగుతోంది. ప్రస్తుతం సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో దీనికి సంబంధించిన ఫోటో చక్కర్లు కొడుతోంది. పట్టు డ్రెస్ లో,చేతికి నిండుగా గాజులతో పెళ్లి కళతో శ్రీజ కనబడుతుండగా, పక్కనే పసుపు దంచే రోలు, ఇల్లంతా చుట్టాలసందడి కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా శ్రీజకు నిశ్చితార్ధమైనట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తల్ని మెగా క్యాంపులో ఎవరూ ఖండించకపోవడంతో, అది నిజమేనన్న నిశ్చయానికి వచ్చారు చాలా మంది. ఏదేమైనా, తమ అభిమాన హీరో ఇంట పెళ్లి కళ రావడంతో, మెగాభిమానులు మాత్రం ఆనందంతో ఉన్నారు.