English | Telugu
రికార్డ్స్ దుమ్ము దులుపుతున్న లెజెండ్
Updated : Feb 26, 2014
బాలకృష్ణ నటిస్తున్న "లెజెండ్" సినిమా ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ కోసం భారీగా పోటీ నెలకొంది. అయితే "లెజెండ్" టీం మాత్రం 8 కోట్ల వరకు టార్గెట్ పెట్టడంతో చాలా మంది పోటీ పడి, చివరకు జెమిని టీవీ 8.5కోట్లతో సొంతం చేసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు మార్చి 7న విడుదల చేయనున్నారు. మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. జగపతి బాబు విలన్ పాత్రలో నటిస్తున్నాడు.