English | Telugu

‘విక్రమార్కుడు’ నటుడ్ని చేరదీసి ఆదుకున్న లారెన్స్‌!

సినిమాల్లోకి బాలనటులుగా వచ్చిన ఎంతో మంది ఆ తర్వాతి కాలంలో హీరోలుగా స్థిరపడిన సందర్భాలు ఉన్నాయి. అయితే అందరి జీవితాలు ఒకేలా ఉండవు. కొందరిని అదృష్టం వరిస్తే.. మరికొందరిని దురదృష్టం వెంటాడుతుంది. అలా బాలనటులుగా సినిమాలు చేసిన ఎంతో మంది ఆ తర్వాత తెరమరుగైపోయారు. అలాంటి ఓ బాలనటుడి జీవితానికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 2006లో రవితేజ, ఎస్‌.ఎస్‌.రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘విక్రమార్కుడు’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కొంతమంది చైల్డ్‌ ఆర్టిస్టులు కూడా నటించారు. ఒక సీన్‌లో క్రికెట్‌ ఆడుతున్న పిల్లవాడు కొట్టిన బాల్‌ రవితేజ ఇంట్లో పడుతుంది. అప్పుడా అబ్బాయి వచ్చి ‘ఏయ్‌ సత్తి బాల్‌ లోపటొచ్చిందా..’ అంటాడు. ఆ అబ్బాయి పేరు రవి రాథోడ్‌.

‘విక్రమార్కుడు’ తర్వాత కొన్ని సినిమాల్లో నటించాడు రవి. అయితే చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. ఆ సమయంలో రాఘవలారెన్స్‌ అతన్ని చేరదీసి ఒక స్కూల్‌లో చేర్పించాడు. కానీ, అతనికి చదువు అబ్బలేదు. ఆ కారణంగానే ఒకరోజు లారెన్స్‌కి చెప్పకుండా ఆ స్కూల్‌ నుంచి పారిపోయాడు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించాడు. అదే సమయంలో మద్యానికి బానిస అయ్యాడు. దాంతో అనారోగ్యానికి గురయ్యాడు. కిడ్నీలో రాళ్లు చేరుకొని నడవలేని స్థితికి చేరుకున్నాడు.

ఆ సమయంలో రవి ఉన్న స్థితి గురించి వచ్చిన వార్త మీడియాలో వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న లారెన్స్‌ తనను కలవాల్సిందిగా రవిని కోరాడు. తనను కలిసిన రవి మద్యానికి బానిస అయ్యాడని తెలిసి మందలించాడు లారెన్స్‌. ఇకపై మద్యం జోలికి వెళ్ళనని లారెన్స్‌కి ప్రామిస్‌ చేశాడు. ప్రామిస్‌ చేసినట్టుగానే మద్యానికి దూరంగా ఉన్నాడు రవి. లారెన్స్‌ ఇచ్చిన డబ్బుతోనే ఫోన్‌ కొనుక్కున్నాడు. ఇప్పుడు అతని ఆరోగ్యం కుదుట పడడంతో మళ్లీ లారెన్స్‌ని కలిసి అతను కొనిచ్చిన ఫోన్‌లోనే సెల్ఫీ తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇలాంటివి లారెన్స్‌ జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఎంతో మందికి సాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ విషయంలో లారెన్స్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంకా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే శక్తి సామర్థ్యాలు అతనికి ఇవ్వాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.