English | Telugu

సినిమాని తొక్కాలని చూసే ఇలాంటి వారిని ఉరి తియ్యాలి!

ఒకప్పుడు సినిమా వాళ్లకి, మీడియాకి మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేది. తాము నిర్మించిన సినిమా రిలీజ్‌ అయిన తర్వాత మీడియాలో వచ్చే రివ్యూలపై దర్శకనిర్మాతలుగానీ, హీరోలుగానీ సానుకూలంగా స్పందించేవారు. సినిమా వారికి, మీడియాకి మధ్య ఎలాంటి వాతావరణం ఉండేదో చెప్పడానికి 60 ఏళ్ళ క్రితం జరిగిన ఒక సంఘటనను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక ప్రముఖ నిర్మాత తీసిన సినిమా బాగా లేదని ఒక పత్రికలో ప్రింట్‌ చేశారు. ‘మా సినిమా బాగానే ఉందని అందరూ అంటున్నారు. మీరు అలా రాశారేమిటి?’ అని ఆ పబ్లిషర్‌ని ప్రశ్నించారు నిర్మాత. దానికా పబ్లిషర్‌ సమాధానమిస్తూ ‘అది మా రివ్యూ రైటర్‌ అభిప్రాయం మాత్రమే. రివ్యూ ఎలా ఉంటే బాగుంటుంది అని మీరనుకుంటున్నారో అలా మీరే రాసి మాకు పంపండి. మేం ప్రింట్‌ చేస్తాం’ అని ఎంతో మర్యాదగా చెప్పారు. అప్పుడా నిర్మాత ఓ రివ్యూ రాయించి ఆ పత్రికకు పంపారు. ఆ రివ్యూని కూడా అచ్చు వేశారా పబ్లిషర్‌. అలా ఒకే పత్రికలో ఒక నెగెటివ్‌ రివ్యూ, ఒక పాజిటివ్‌ రివ్యూ ప్రింట్‌ అయ్యాయి.

ఆరోజుల్లో సినిమా వాళ్ళకి, మీడియాకి మధ్య అంత మంచి రిలేషన్‌ ఉండేది. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. తమ సినిమా గురించి ఎవరైనా చెడుగా రాస్తే.. వారి మీద అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు దర్శకనిర్మాతలు. బాహాటంగానే విమర్శలకు దిగుతున్నారు. పరుష పదజాలంతో మీడియాలోని అందర్నీ దూషిస్తున్నారు. ఇటీవలికాలంలో ఇలాంటివి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలా హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఇలా మీడియా మీద విరుచుకుపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా ‘కెర్యాంప్‌’ చిత్రానికి సంబంధించి అలాంటి వ్యాఖ్యలే చేశారు నిర్మాత రాజేష్‌ దండా.

కిరణ్‌ అబ్బవరం హీరోగా జైన్స్‌ నాని దర్శకత్వంలో రాజేష్‌ దండా నిర్మించిన ‘కె ర్యాంప్‌’ రిలీజ్‌ అయింది. మూడురోజుల్లో 17 కోట్లు కలెక్ట్‌ చేసి సినిమా బ్రేక్‌ ఈవెన్‌ అయిందని యూనిట్‌ ప్రకటించింది. ఈ సినిమాకి సంబంధించి జరిగిన సక్సెస్‌మీట్‌లో నిర్మాత రాజేష్‌ దండా ఒక న్యూస్‌ పోర్టల్‌ మీద విరుచుకుపడ్డారు. తమ సినిమా గురించి కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పరుష పదజాలంతో ఆ న్యూస్‌ పోర్టల్‌ యాజమాన్యాన్ని దూషించారు. బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయినప్పటికీ సినిమాని తొక్కాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి వారిని ఊరికే వదలకూడదని, ఉరి తియ్యాలని ఆవేశంగా మాట్లాడారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం