Read more!

English | Telugu

ఆర్ఎక్స్ 100 కార్తికేయ హనుమాన్ ని నమ్మాడు.. మహేష్ బాబు, విశ్వంభర నిర్మాతలే సాక్ష్యం   

ఆర్ఎక్స్ 100 తో  తెలుగు ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించిన హీరో కార్తికేయ. ఇప్పుడు ఈయన కూడా అంజనా సుతుడు  హనుమంతుడిని నమ్ముకుంటున్నాడు. ఇటీవల తేజ సజ్జ హనుమాన్ ని నమ్ముకొని పాన్ ఇండియా లెవల్లో సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు కార్తికేయ కూడా అదే స్థాయిలో హిట్ కొట్టాలనుకుంటున్నాడు. 


చిరంజీవితో విశ్వంభర ని తెరకెక్కిస్తున్న యువి క్రియేషన్స్ కార్తికేయ హీరోగా  ఒక చిత్రాన్ని నిర్మిస్తుంది. ఆల్రెడీ  షూటింగ్ దశలో ఉంది.ఇప్పుడు ఈ మూవీకి భజే వాయు వేగం అనే ఒక పవర్ ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఈ మేరకు ఒక పోస్టర్ ని  కూడా రిలీజ్ చేసారు. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా అది రిలీజ్ అయ్యింది.  బ్యాట్ పట్టుకొని మంచి యాక్షన్ సీక్వెన్స్ లో కార్తికేయ ఉన్నాడు.  కింద డబ్బు నోట్లు కూడా  ఎగురుతు చాలా ఇంట్రెస్ట్ గా ఉంది.

దీంతో పాటుగా నిమిషం వ్యవధి ఉన్న  ఒక మోషన్  వీడియోని కూడా  రిలీజ్ చేశారు. అది కూడా సరికొత్తగా ఉండి అందర్నీ ఆకట్టుకుంటుంది. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా చేస్తుండగా రధన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవల వరుస అపజయాల్లో ఉన్న తనకి  భజే వాయు వేగం విజయాన్ని అందిస్తుందనే నమ్మకంతో కార్తికేయ ఉన్నాడు. ఆయన చివరిగా బెదురులంక లో నటించాడు.