English | Telugu

కాంతార చాప్టర్ 1 ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్.. థియేటర్స్ కి పోటెత్తుతున్న పబ్లిక్ 

'కాంతార చాప్టర్ 1'(Kantara Chapter 1)సాధించిన విజయం తాలూకు స్వరూపం అందరికి తెలిసిందే. మేకింగ్, టెక్నికల్, పెర్ఫార్మెన్స్ పరంగా పాన్ ఇండియా మేకర్స్ ముందు సరికొత్త సవాలు కూడా ఉంచింది. రెగ్యులర్ సినిమాలకి భిన్నంగా సిల్వర్ స్క్రీన్ పై ఒక సరికొత్త ప్రపంచం ప్రత్యక్షమవ్వడంతో ప్రేక్షకులైతే కాంతార కి పూర్తిగా సరెండర్ అవ్వడంతో పాటు, ఐ ఫీస్ట్ అనుభూతిని కూడా పొందుతున్నారు.

రీసెంట్ గా కాంతారా చాప్టర్ 1 కి సంబంధించిన కొత్త ట్రైలర్ విడుదలైంది. తమకి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకి దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తు మూడు నిమిషాల నిడివితో రిలీజ్ చేసిన ట్రైలర్, మొదటి ట్రైలర్ కంటే ఎంతో అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారడంతో పాటు, సదరు ట్రైలర్ చూసిన అభిమానులు మళ్ళీ మూవీకి వెళ్లాలని అనిపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.

కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఇప్పటి వరకు 700 కోట్ల రూపాయల గ్రాస్ ని రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాల లెక్కలు చెప్తున్నాయి. పైగా రెండు వారాలకే ఆ ఫీట్ ని సాధించడం విశేషం. తెలుగులోనే ఇప్పటి వరకు 100 కోట్ల గ్రాస్ కి పైగా రాబట్టి మరిన్ని కలెక్షన్స్ సాధించే దిశగా వెళ్తుంది.



పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.