English | Telugu
బెనిఫిట్ షో రోజు థియేటర్ కి వెళ్ళను..అల్లు అర్జున్ వల్లనే కదా!
Updated : Mar 23, 2025
మంచు విష్ణు(Manchu Vishnu)ఏప్రిల్ 25 న వరల్డ్ వైడ్ గా 'కన్నప్ప'(kannappa)గా థియేటర్స్ లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే.పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చారిత్రాత్మక మూవీ విష్ణు కెరీరి లోనే హై బడ్జెట్ తో పాటు మోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీగా నిర్మాణం జరుపుకుంది.మోహన్ బాబు,ప్రభాస్,మోహన్ లాల్,శరత్ కుమార్,అక్షయ్ కుమార్ వంటి అగ్ర నటులు అతిధి పాత్రలో కనిపిస్తుండంతో 'కన్నప్ప పై'అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పవచ్చు.
ఇక మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా జోరందుకున్నాయి.రీసెంట్ గా విష్ణు ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు డిమాండ్ ఉన్న సినిమాలకి బెనిఫిట్ షోస్ వెయ్యడం తప్పు లేదు.పైగా అన్ని సినిమాలకి బెనిఫిట్ షోస్ కుదరదు కదా,సంవత్సరానికి ఐదు సినిమాలకో ఆరు సినిమాలకో ఉంటుంది.కాకపోతే పుష్ప 2 బెనిఫిట్ షో లో జరిగిన అపశృతితో రిలీజ్ రోజు థియేటర్ కి వెళ్లకూడదని డిసైడ్ అయ్యా. ఆ సంఘటనతో ఇండస్ట్రీ లో అందరం బాధపడ్డాం.10 సంవత్సరాల ముందు రోజులు వేరు.ఇప్పటి రోజులు వేరే,అందుకే వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను.మా అభిమానులకి చాలా సంవత్సరాల నుంచి మంచి సినిమా ఇవ్వలేకపోయాం.ముఖ్యంగా నాన్నగారి అభిమానులకి హిట్ కొరతని తీర్చడంతో పాటు ఒక గ్రేట్ మెమొరీ గా కన్నప్ప ఉండబోతుందని చెప్పుకొచ్చాడు.
కన్నప్ప కి మహాభారతం సీరియల్ ఫేమ్ 'ముకేశ్ కుమార్ సింగ్'(Mukesh KUmar Singh)దర్శకత్వం వహించగా విష్ణు కి జోడిగా ప్రముఖ భరత నాట్య కళాకారిణి ప్రీతీ ముకుందన్(Preity Mukhundhan)కాజల్ అగర్వాల్ పార్వతి మాతగా కనపడనుంది.బ్రహ్మాజీ, రఘుబాబు,బ్రహ్మానందం,దేవరాజ్,శివబాలాజీ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.స్టీఫెన్ దేవస్సి సంగీతాన్ని అందించగా షెల్డన్ ఫొటోగ్రఫీ ని అందించాడు.