English | Telugu

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎన్టీఆర్..ఆ భాషలో మాట్లాడితే ఏంటి పరిస్థితి 

మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)గత ఏడాది 'దేవర'(Devara)తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని అందుకున్న విషయం తెలిసిందే.సుమారు 500 కోట్ల దాకా గ్రాస్ ని రాబట్టిన 'దేవర',సిల్వర్ స్క్రీన్ వద్ద ఎన్టీఆర్ కి ఉన్న చరిష్మా ఏ పాటిదో మరోసారి చాటి చెప్పింది.ఇప్పుడు ఈ మూవీ జపాన్ దేశంలో జపాన్ లాంగ్వేజ్ లోనే ఈ నెల 28 న అత్యధిక థియేటర్లో విడుదల కాబోతుంది.

ఈ సందర్భంగా ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ జపాన్(Japan)బయలుదేరి వెళ్ళాడు.ప్రమోషన్స్ లో భాగంగా జరిగే మీడియా సమావేశంలో దేవర కి సంబంధించిన పలు విషయాలని అక్కడి ప్రేక్షకులతో పంచుకోవడంతో పాటు,అభిమానులని ఉద్దేశించి కూడా ప్రసంగించనున్నాడు.ఈ మేరకు ఎన్టీఆర్ ఏం మాట్లాతాడనే ఆసక్తి అందరిలో మొదలైంది.'ఆర్ఆర్ఆర్' తో జపాన్ లో ఎన్టీఆర్ కి ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఏర్పాటయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో అక్కడి అభిమానుల కోసం ఎన్టీఆర్ జపాన్ భాషలో ఏమైనా మాట్లాతాడా అనే విషయాన్నీ కూడా అభిమానులు చర్చించుకుంటున్నారు.ఇక దేవర ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్తానని ఎన్టీఆర్ గతంలోనే చెప్పిన విషయం తెలిసిందే.దీంతో ఇచ్చిన మాటని ఎన్టీఆర్ నిలబెట్టుకున్నాడని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం జపాన్ లో దేవర ప్రత్యేక ప్రివ్యూ స్క్రీనింగ్ జరిగింది.మూవీ రిలీజ్ చేయడానికి ముందు,ప్రేక్షకుల స్పందనను అంచనా వేయడానికి 'షో' వెయ్యడం జరుగుతుంది.ఈ స్క్రీనింగ్‌కి వివిధ వర్గాల ప్రజలను ఆహ్వానించి,ప్రశ్నాపత్రాలు లేదా ఇతర మార్గాల ద్వారా వారి అభిప్రాయాలని తెలుసుకుంటారు.దీంతో చిత్రబృందం తమ సినిమాని మెరుగుపరచడానికి, మార్పులు చేయడానికి అవసరమైన అభిప్రాయాలను సేకరిస్తుంది.దేవర ప్రైవేట్ ప్రివ్యూ స్క్రీనింగ్‌లో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.మూవీ చూసిన జపాన్ సినీ ప్రేమికులు జపాన్ భాషలో సోషల్ మీడియా(Social Media)వేదికగా ట్వీట్ లు చేస్తున్నారు.వాటి తాలూకు వీడియోస్ సోషల్ మీడియాలో గత కొన్ని రోజుల నుంచి వైరల్ గా మారాయి.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం