English | Telugu

కన్నడ భాషపై చేసిన కామెంట్స్ పై కమల్ వివరణ  

కొన్ని రోజుల క్రితం 'లోకనాయకుడు 'కమల్ హాసన్'(Kamal Haasan)లెజండ్రీ మేకర్ 'మణిరత్నం'(Mani Rathnam)దర్శకత్వంలో తెరకెక్కిన 'థగ్ లైఫ్'(Thug Life)ఆడియో ఫంక్షన్ చెన్నైలో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకి ముఖ్య అతిధిగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్(SIvaraj Kumar)హాజరయ్యాడు. ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ ని ఉద్దేశించి కమల్ మాట్లాడుతు 'మనమంతా ఒక్కటే. కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందే అనే వ్యాఖ్యలు చేసాడు. ఈ మాటలతో కన్నడ నాట ఆ రాష్ట్ర భాషా సంఘాలతో పాటు పలు రాజకీయ పార్టీలు తీవ్రస్థాయిలో కమల్ ని దుర్భాషలాడుతున్నాయి. కన్నడ ప్రజలకి కమల్ ఈ రోజు సాయంత్రం లోపు క్షమాపణ చెప్పాలి. లేదంటే జూన్ 5 న విడుదలవుతున్న 'థగ్ లైఫ్' ని కర్ణాటక వ్యాప్తంగా బ్యాన్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.

ఈ విషయంపై కమల్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు భాష గురించి నేను చేసిన వ్యాఖ్యలు ప్రేమతో చేసినవే గాని మరో ఉద్దేశం లేదు. ప్రేమ ఎప్పుడు క్షమాపణ చెప్పదు. భాషా చరిత్ర గురించి ఎంతో మంది చరిత్రకారులు నాకు చెప్పారు. నేను ఏ విషయంలో నైనా తప్పు చేస్తేనే క్షమాపణలు చెప్తాను. భారత దేశం ప్రజాస్వామిక దేశం. నేను చట్టాన్ని, న్యాయాన్ని నమ్మడంతో పాటు గౌరవిస్తాను.ఈ విషయంలో ప్రజలు జ్యోక్యం చేసుకోవద్దు. భాష గురించి మాట్లాడే అర్హత నాతో సహా ఇప్పుడున్న రాజకీయనాయకులకి లేదని చెప్పుకొచ్చాడు.

' థగ్ లైఫ్' లో కమల్ తో పాటు శింబు, అభిరామి, త్రిష, నాజర్, జోజు జార్జ్, తనికెళ్ళ భరణి వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించగా ఏ ఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించాడు. మద్రాస్ టాకీస్, రాజ్ కమల్ ఇంటర్ నేషనల్ పతాకంపై కమల్, మణిరత్నం అత్యంత భారీ వ్యయంతో నిర్మించారు.


బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం