English | Telugu

వీరమల్లు నుంచి మధ్యలోనే క్రిష్ వెళ్లిపోవడానికి కారణం ఇదే

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)వన్ మాన్ షో 'హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu)పార్ట్ 1 'ప్రస్తుతం థియేటర్స్ లో తన సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. టాక్ తో సంబంధం లేకుండా పవన్ కెరీర్ లోనే ఫస్ట్ టైం 100 కోట్ల క్లబ్ లోకి కూడా చేరింది. అగ్ర నిర్మాత 'ఏఎంరత్నం'(Am Rathnam)నిర్మించిన ఈ చిత్రానికి 'క్రిష్'(Krish)మరియు 'జ్యోతికృష్ణ'(Jyothi Krishna)సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఈ మేరకు మేకర్స్ కూడా మూవీ టైటిల్స్ లో చెప్పడం జరిగింది.

రీసెంట్ గా 'జ్యోతికృష్ణ' ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'హరిహర వీరమల్లు' ప్రారంభం నుంచి నేను ఉన్నాను. వీరమల్లు కథని ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ 'మాయాబజార్ 'టైపులో ఫన్ సినిమాగా తెరకెక్కించాలని 'క్రిష్' అనుకున్నారు. ఒక యాక్షన్ సీక్వెన్స్ తో షూటింగ్ ప్రారంభించాం. కానీ కోవిడ్ రావడంతో చిత్రీకరణ ఆగిపోయింది. కొంచం తగ్గుముఖం పట్టాక, ఇంకో యాక్షన్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేసాం. కోవిడ్ సెకండ్ వేవ్ రావడంతో ఆపేశాం. ఆ తర్వాత ఎన్నికలు వచ్చి వీరమల్లు షూటింగ్ కి వరుస బ్రేక్స్ వచ్చాయి. ఈ విధంగా క్రిష్ ఏడాది పాటు వెయిట్ చేసిన తర్వాత,ఆయన అంగీకరించిన ప్రాజెక్ట్స్ ఉండటంతో వీరమల్లు నుంచి వైదొలిగారు. పవన్ గారితో రెండు పార్టులుగా వీరమల్లుని తెరకెక్కిస్తానని కథని చెప్పాను. చాలా బాగుందని మెచ్చుకొని దర్శకత్వం చెయ్యమని చెప్పారు.

క్రిష్ అనుకున్న 'కోహినూర్'డైమండ్(kohinoor Diamond)కథ పార్ట్ 2 లో వస్తుంది. మొదటి భాగం కథలో నేను మార్పులు చేశాను. రెండవ భాగంలో కోహినూర్ కోసం అసలేం జరిగిందనేది చూపిస్తున్నాం. వీరమల్లు కోసం 4399 సిజి షాట్స్ ని ఉపయోగించాం. వాటిల్లో నాలుగైదు షాట్స్ బాగా రాలేదు . మూవీ ఎంత బాగా వచ్చినా ఏదో ఒక మైనస్ పాయింట్ చెప్తూనే ఉంటారు. వీరమల్లు విషయంలో మాత్రం సినిమా బాగాలేదని ఎవరు చెప్పడం లేదు. కొన్నిసన్నివేశాల్లో సిజి వర్క్ బాగాలేదని చెప్తున్నారంతే. సెకండ్ పార్ట్ ఇంకా చాలా బాగుంటుందని జ్యోతికృష్ణ చెప్పుకొచ్చాడు. జ్యోతికృష్ణ గతంలో గోపి చంద్ హీరోగా బలమైన సోషల్ మెసేజ్ తో తెరకెక్కిన 'ఆక్సిజన్' తో పాటు 'నీ మనసు నాకు తెలుసు', కేడి, రూల్స్ రంజన్ వంటి పలు చిత్రాలకి దర్శకత్వం వహించాడు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .