English | Telugu
ఎన్టీఆర్‌ని బాలయ్య ఆహ్వానిస్తాడా??
Updated : Apr 6, 2015
నందమూరి బాలకృష్ణ - ఎన్టీఆర్‌ల మధ్య అడ్డు తెరలను దించడానికి మరో అవకాశం వచ్చింది. బాబాయ్ - అబ్బాయ్‌ల మధ్య బ్రిడ్జ్ వేయడానికి ఇంకో ఛాన్స్ దక్కింది. బాలయ్య, ఎన్టీఆర్ లమధ్య గ్యాప్ రోజురోజుకీ పెరిగిపోతోందన్న మాట నందమూరి అభిమానులే ఒప్పుకొంటారు. వీళ్లిద్దరిని కలపడానికి నందమూరి కాంపౌండ్ వర్గాలు, టీడీపీ పార్టీలోని ప్రముఖులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇప్పుడు వీరిద్దరి మధ్య సఖ్యత పెరగడానికి.... ఓ ఛాన్స్ వచ్చింది. త్వరలోనే నందమూరి బాలకృష్ణ లయన్ ఆడియో వేడుక హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ వస్తాడా? రాడా?? అనే ప్రశ్నలు దలయ్యాయి. టెంపర్ ఆడియోకి బాలయ్య వస్తాడనుకొన్నారంతా. కానీ సాధ్యం కాలేదు. ఈసారి బంతి బాలయ్య కోర్టులో ఉంది. బాలయ్య స్వయంగా కల్పించుకొని ఎన్టీఆర్‌ని ఆహ్వానిస్తాడా? లేదంటే ఎన్టీఆర్ తనకు తాను స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి వస్తాడా?? అనే విషయాలపై అభిమానులు ఆసక్తిగా చర్చించుకొంటున్నారు. బాలయ్య ఒక మెట్టు దిగడు, ఎన్టీఆర్ పంతం తగ్గించుకోడు. ఆయన పిలవడు.. ఈయన వెళ్లడు. ఈ గ్యాప్ ఇలా కొనసాగుతుందంతే.. అంటూ నందమూరి అభిమానులే వ్యాఖ్యానించుకోవడం విశేషం. కల్యాణ్‌రామ్‌తో అటు బాలయ్యకు ఇటు ఎన్టీఆర్‌కూ మంచి సంబంధాలున్నాయి. ఆయనే మద్యవర్తిగా వ్యవహరిస్తే ఈ గొడవ వదిలిపోతుంది కదా... అంటున్నవాళ్లూ ఉన్నారు. మరి కల్యాణ్ రామ్ ఆ సాహసానికి పూనుకొంటాడో లేదో చూడాలి మరి. మొత్తానికి లయన్ పాటలు ఎలా ఉంటాయి అనే ఆలోచనల కంటే ఈ వేడుకకు ఎన్టీఆర్ వెళ్తాడా, వెళ్లడా? అనే సందేహాలే ఎక్కువైపోయాయి. చూద్దాం.. ఏం జరుగుతుందో.