English | Telugu
జానీ మాస్టర్ నన్ను లైంగికంగా వేధించాడు.. కేసు నమోదు చేసిన పోలీసులు
Updated : Sep 15, 2024
రీసెంట్ గా తిరు(tiru)మూవీలోని మేఘం కరిగిన సాంగ్ కి జాతీయ అవార్డుని అందుకొని, తెలుగు డాన్స్ మాస్టర్స్ కీర్తిని ఇండియన్ చిత్ర సీమకి తెలియచేసిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(johnny master)కొన్ని రోజుల క్రితం నాకు సినిమాల్లో అవకాశాలు రాకుండా జానీ మాస్టర్ అడ్డు పడుతున్నాడని ఒక డాన్సర్ ఫిర్యాదు చేసిన విషయం మరువక ముందే ఇప్పుడు లైంగిక వేధింపుల ఆరోపణలపై జానీ మాస్టర్ మీద ఒక కేసు నమోదు అయ్యింది.
జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నట్లు ఇరవై ఒక్క సంవత్సరాల ఒక లేడీ కొరియోగ్రాఫర్ హైదరాబాద్ లోని రాయదుర్గం పీఎస్ లో ఫిర్యాదు చేసింది. చెన్నై,ముంబై తో పాటు ఇతర ప్రాంతాలకి అవుట్‌డోర్ షూటింగ్ లకు వెళ్లినపుడల్లా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, నార్సింగిలోని తన నివాసంలో కూడా అనేకసార్లు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళ కొరియోగ్రాఫర్ తన ఫిర్యాదులో పేర్కొంది. సదరు యువతీ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేసారు. కాకపోతే ఆ యువతీ నార్సింగి కి చెందినది కావడంతో తదుపరి విచారణ కోసం కేసుని నార్సింగి పోలీసులకు బదిలీ చెయ్యడం జరిగింది. దీంతో అక్కడి పోలీసులు జానీ మాస్టర్ పై ఐపిసి సెక్షన్ 376 సెక్షన్ 506 ,సెక్షన్ 323 కింద కేసులు నమోదు చేసారు.
ఇక జానీ మాస్టర్ కు గతంలో నేర చరిత్ర సైతం ఉందని, 2015లో ఒక కాలేజీ కి చెందిన మహిళపై దాడి కేసులో మేడ్చల్ స్థానిక కోర్టు జానీ మాస్టర్ కు ఆరు నెలల జైలు శిక్ష విధించిందని, బెయిల్ పై విడుదలైన తర్వాత కూడా జానీ మాస్టర్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని కూడా ఆ యువతీ తన ఫిర్యాదులో పేర్కొంది.