English | Telugu

దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి షాక్!ఇందుకు కారణం పక్కాగా వాళ్లేనా! 

ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ఉన్న హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)కూడా ఒకడు. ఆర్ఆర్ఆర్ తో ఆ ఘనతని సాధించి తెలుగు వారి స్టామినా ఏంటో నిరూపించిన ఎన్టీఆర్ ఈ సెప్టెంబర్ 27 న దేవర(devara)గా సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టబోతున్నాడు. ఈ మేరకు ప్రమోషన్స్  కూడా  ఒక రేంజ్ లో స్టార్ట్ అయ్యాయి. దీంతో  ఇప్పుడు అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా పండుగ వాతావరణం వచ్చిందని చెప్పవచ్చు.   

ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్  కర్నూల్ లో అభిమానుల మధ్య భారీ ఎత్తున జరగబోతుందనే న్యూస్ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వినిపిస్తు ఉంది. దాంతో  మేకర్స్ నుంచి  అధికార ప్రకటన కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు ఎదురుచూస్తు ఉన్నారు. కానీ ఇప్పుడు కర్నూల్ లో జరిగే అవకాశాలు కనిపించటం లేదు. అక్కడనే  కాదు అసలు అవుట్ డోర్ లోనే  ఈవెంట్ జరగదనే వార్తలు వస్తున్నాయి.ఇందుకు కారణం అభిమానులే అని,ఎందుకంటే  ఎన్టీఆర్ కి ఉన్న లక్షలాది మంది అభిమానులు ఈవెంట్ కి వచ్చే అవకాశం ఉందని, పైగా దేవరకి ఆ తాకిడి మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. దీంతో పోలీసులు కంట్రోల్ చెయ్యలేని పరిస్థితి ఏర్పడి సరికొత్త సమస్యలు  తలెత్తే  అవకాశం  ఉంటుందని భావించి పరిమిత అభిమానులతో హైదరాబాద్ నోవటల్ లో చేయాలని ఫిక్స్ అయ్యినట్టుగా తెలుస్తుంది.అయితే దీనిపై అధికారిక క్లారిటీ  రావాల్సి ఉంది. సో ఎన్టీఆర్ కి ఉన్న విపరీతమైన ఫాలోయింగే పబ్లిక్ ఈవెంట్ కి  ఆటంకం అవుతుందని చెప్పవచ్చు.

ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్ వ్యూయర్స్ పరంగా పలు రికార్డులని తన ఖాతాలో వేసుకుంటుంది. అంతే కాకుండా  ఇద్దరు ఎన్టీఆర్ లు ఫస్ట్ పార్టు లోనే స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని తెలియడంతో అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు.ఎప్పుడెప్పుడు ఇరవై ఏడు డేట్ వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్(jahnvi kapoor)కధానాయిక కాగా  జనతా గ్యారేజ్ లాంటి  బ్లాక్ బస్టర్ హిట్  తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ(koratala siva)కాంబో లో దేవర రాబోతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్  మూడువందల కోట్ల భారీ బడ్జట్ తో  సంయుక్తంగా నిర్మించాయి.