English | Telugu
సందీప్ కిషన్ తో విజయ్ తనయుడి మూవీ.. మోషన్ పోస్టర్ విడుదల!
Updated : Nov 29, 2024
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు లైకా సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ మోషన్ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ హెడ్ జికెఎం తమిళ్ కుమరన్ మాట్లాడుతూ.. " జాసన్ సంజయ్‌ను తెరకెక్కించబోతున్న కథ, ఆయన నెరేషన్ విన్నప్పుడు డిఫరెంట్‌గా అనిపించింది. అన్నింటికంటే ముఖ్యంగా, పాన్-ఇండియా దృష్టిని ఆకర్షించే ప్రధానమైన పాయింట్ ఉంది." అన్నారు.
ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. 2025 జనవరి నుంచి మూవీ షూటింగ్‌ను స్టార్ట్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.