English | Telugu
సినిమాల్లోని తల్లి క్యారక్టర్ పై కామెంట్స్ చేసిన సందీప్ రెడ్డి వంగ
Updated : Dec 7, 2024
అర్జున్ రెడ్డి,కబీర్ సింగ్,యానిమల్ వంటి సినిమాలతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తన సత్తా చాటిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. యానిమల్ ద్వారా అయితే వరల్డ్ వైడ్ గా తొమ్మిదివందల కోట్లకి పైగా రాబట్టి తెలుగు వారి సత్తాని కూడా చాటి చెప్పాడు.ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ అనే మూవీ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు.
ఇక సందీప్ రెడ్డి లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు.అందులో ఆయన మాట్లాడుతు నేను నా సినిమాల్లో తల్లి క్యారక్టర్ కి ప్రాధాన్యత ఇవ్వననే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తుంటారు.నిజానికి నా నిజ జీవితంలో మా అమ్మతో చాలా చనువుగా ఉంటాను.నన్ను ఎంతో సపోర్ట్ చేసి నా కెరీర్ ముందుకు వెళ్లడానికి మా అమ్మ ఎంతగానో సహకరించింది.నా యాక్టింగ్ స్కూల్ ఫీజుల దగ్గర్నుంచి అర్జున్ రెడ్డి ప్రొడక్షన్ వరకు ఎన్నో విషయంలో ఆమె తన సహకారాన్ని అందచేసింది.
ఎక్కువ అటాచ్ మెంట్ ఉండటం వల్ల ఒక్కోసారి ఆమెని ఎదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయి.మా బంధంలో ఎలాంటి సమస్యలు లేకపోవడం వల్లే సినిమాల్లో నేను మదర్ డ్రామాని తీసుకురాలేకపోతున్నాను.ఒక వేళ తల్లి,కొడుకు సెంటిమెంట్ తో సినిమా తెరకెక్కిస్తే కనుక అందులో హింసకి చోటు లేకుండా పూర్తి పాజిటివ్ వైబ్రేషన్ తోఉంటుందని చెప్పుకొచ్చాడు.