English | Telugu

పిల్లల కోసం పెళ్ళెందుకంటున్న లంక బ్యూటీ

ఎన్ని సినిమాలు చేసినా కూడా సరైన గుర్తింపును సంపదించుకోవట్లేదు శ్రీలంక బ్యూటీ జాక్వేలిన్ ఫెర్నాండేజ్. అయితే ఈ అమ్మడు ఇటీవలే భారతీయ హిందూ వ్యవస్థపై తన అభిప్రాయాన్ని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.

"ఈ మధ్య పెళ్ళిళ్ళ కన్నా విడాకుల కేసులే ఎక్కువయ్యాయి. ఎక్కువ కాలం కొనసాగే బంధుత్వం కన్నా కొద్దిరోజులు ఉండి, సంతోషంగా ఉండే బంధుత్వం అంటేనే తనకు ఇష్టం" అని అంటుంది. మరి పిల్లల సంగతి అని అడిగితే...." పెళ్లి చేసుకుంటేనే పిల్లల్ని కనవచ్చా? అయినా పెళ్లి చేసుకుంటానో లేదో తెలియదు కానీ పిల్లల్ని మాత్రం కంటాను" అని చెప్పే అక్కడి వారందరికి పెద్ద షాక్ ఇచ్చింది.


ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.