English | Telugu
విలన్ గా శింబు... ఏ సినిమాలో తెలుసా?
Updated : Jul 9, 2023
ఎప్పుడూ వార్తల్లో ఉండే కొంతమంది హీరోల్లో శింబు ముందు బెంచ్ లో ఉంటారు. ఈ తమిళ హీరోకి తెలుగులోనూ ఫాలోయర్స్ ఉన్నారు. యంగ్ హీరోగా పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు శింబు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు కెరీర్లో ఒడుదొడుకులు చూశారు. మానాడు సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఈ సినిమా తర్వాత ఆయన వెందు తనిందదు కాడు చిత్రంలో నటించారు. దీనికి కూడా తమిళనాడులోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి స్పందన వచ్చింది. ఈ రెండు చిత్రాల తర్వాత ఎస్ టి ఆర్ 48 సినిమాను అనౌన్స్ చేశారు. దేశింగ్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకం పై కమలహాసన్ తెరకెక్కిస్తున్నారు.
100 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమా ఇది. శింబు కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమా గా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా కోసమే మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు శింబు. లండన్ లోనూ, థాయిలాండ్ లోను దీనికి సంబంధించి ప్రిపరేషన్ లో పాల్గొన్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్ కూడా గెస్ట్ రోల్ చేస్తారని వార్తలు వచ్చాయి. ఎస్ టి ఆర్ 48వ సినిమా ఇప్పటికే ఫ్లోర్స్ మీదకి వెళ్లాల్సింది. కానీ వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఓనర్ ఐసరి కె గణేష్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో శింబు మీద ఇచ్చిన కంప్లైంట్ కారణంగా ఈ సినిమా ప్రారంభం వాయిదా పడింది. ఐసరి గణేష్ తో శింబు ఇంతకుముందే మల్టీ ఫిల్మ్ డీల్ చేసుకున్నారట. అయితే దానికి సంబంధించి అడ్వాన్స్ కూడా తీసుకొని కాల్ షీట్లు కేటాయించలేదట. తన సినిమాకు సంబంధించి ఏదో ఒక నిర్ణయం ప్రకటించిన తర్వాతే కొత్త ప్రాజెక్టులోకి శింబు వెళ్లాలని ఐసరి గణేష్ చెప్తున్న మాట. దీనికి సంబంధించి తాజాగా కమల్ హాసన్ కూర్చుని వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చినట్టు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఎస్ టి ఆర్ 48 త్వరలోనే సెట్స్ మీద వెళ్లడానికి అన్ని సుముఖంగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. శింబు సినిమా ప్రారంభోత్సవమే అభిమానులకు ఒక శుభవార్త అంటే, అంతకు మించిన శుభవార్త మరొకటి కోడంబాకంలో వైరల్ అవుతుంది. ఎస్ టి ఆర్ 48 లో శింబు డ్యూయల్ రోల్ లో కనిపిస్తారన్నది ఈ వార్త సారాంశం. ఎపిక్ పీరియడ్ ఫిల్మ్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మెజిస్టిక్ ప్రోటగనిస్ట్ గా ఓ క్యారెక్టర్ లో కనిపిస్తారు శింబు. మరో క్యారెక్టర్లో విలన్‌గా కనిపిస్తారు. శింబు వర్సెస్ శింబు పోటీని చూడడానికి మేము రెడీ అంటూ హింట్ ఇస్తున్నారు ఫాన్స్. 2024లో స్క్రీన్స్ మీదకు రానుంది ఎస్ టి ఆర్ 48.