English | Telugu

చిరంజీవి కుర్చీ మడతబెట్టి 22 ఏళ్ళు.. బాలకృష్ణ సలహాలు ఇచ్చి ఉంటాడా!

మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)హీరోగా 2002 లో వచ్చిన మూవీ ఇంద్ర(indra)అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులన్నిటిని కుర్చీ మడత పెట్టినట్టు మడత పెట్టి మూలన కూర్చోబెట్టింది. ఇలాంటివి విజయాలు చిరంజీవి కెరీర్ లో అప్పటికే చాలా ఉన్నాయి. కానీ ఈ విజయం మాత్రం చాలా ప్రత్యేకమైనది. అలాంటి ఇంద్ర ఒక అరుదైన మెమొరీబుల్ ని మెగా అభిమానులతో, ప్రేక్షకులతో పంచుకుంటుంది.

 జులై 24  2002 న ఇంద్ర రిలీజ్ అయ్యింది. అంటే నేటికి  22  సంవత్సరాల్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిరు తన ఆనందాన్ని తెలియచేస్తూ ఒక ట్వీట్ కూడా చేసాడు . అఖండ  విజయంతో ఇంద్ర  పరిశ్రమను స్వాధీనం చేసుకుంది. మరియు తిరుగులేని రికార్డుకు మార్గం సుగమం చేసిందని ట్వీట్ చేసాడు. ఇరవై రెండేళ్లు అయినా కూడా చిరు ఆ విధంగా స్పందించాడంటే  ఇంద్ర ఆయనకెంత స్పెషల్ మూవీనో అర్ధం చేసుకోవచ్చు. రాయలసీమకి చెందిన ఇంద్రసేనారెడ్డి తన ఊరి ప్రజల బాగు కోసం తన యావదాస్తినంత శత్రువులకి ఇచ్చేసి  కాశీలో బతుకుతుంటాడు. ఆ తర్వాత మళ్ళీ తన మేనకోడలు జీవితం కోసం  సీమలో అడుగుపెట్టి ఫ్యాక్షనిజాన్ని అంతం చెయ్యడం అనే పాయింట్ తో ఇంద్ర  తెరకెక్కింది.  టాక్సీ నడుకుపునే శంకర్ నారాయణగా, ఇంద్ర సేన రెడ్డి గా చిరు విజృంభించి నటించాడు. పైగా అప్పటి వరకు చూడని సరికొత్త బాడీ లాంగ్వేజ్ ని ప్రదర్శించాడు. ఇక చిరు వేసే స్టెప్ లకి అయితే అభిమానులు, ప్రేక్షకులు పూనకంతో ఊగిపోయారు. 

 

సోనాలి బింద్రే , ఆర్తి అగర్వాల్ హీరోయిన్లు గా చెయ్యగా అల్లు రామలింగయ్య, తనికెళ్ళ భరణి, ముకేశ్ రిషి, బ్రహ్మనందం, ఏం ఎస్ నారాయణ తదితరులు ముఖ్య పాత్రలో మెరిశారు.ఇక మణిశర్మ సంగీత సారధ్యం లో వచ్చిన సాంగ్స్ నేటికీ మారుమోగిపోతూనే ఉన్నాయంటే వాటి స్థాయి అర్ధం చేసుకోవచ్చు. అలాగే బి గోపాల్(b.gopal)దర్శకత్వ ప్రతిభ ఇంద్ర తో  మరో సారి బయటపడింది. ప్రతి ఫ్రేమ్ ని అద్భుతంగా మలిచి తన కోసం కూడా రిపీటెడ్ గా చూసేలా చేసాడు.వైజయంతి బ్యానర్ పై అశ్వని దత్(aswani dat) అత్యంత భారీ వ్యయంతో నిర్మించగా పాటల్లో కూడా దత్తు భారీ తనం కనపడుతుంది. 156 సెంటర్స్ లో 50 రోజులు,  118 థియేటర్స్ లో వంద రోజులు జరుపుకుంది. ఇక ఇంద్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ సెట్స్ కి బాలకృష్ణ(balakrishna)కూడా వెళ్ళేవాడు. దీంతో అప్పటికే రాయలసీమ నేపథ్యంలో బాలయ్య చేసి ఉన్నాడు కాబట్టి,చిరు కి ఏమైనా సజిషన్స్ ఇచ్చి ఉండేవాడని అప్పట్లో చాలా మంది అనుకున్నారు.