English | Telugu

ఇండియాలో తొలి సూపర్‌ హీరోయిన్‌గా ‘మహాకాళి’ వచ్చేస్తోంది!

ప్రశాంత్‌వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి తొలి సినిమాగా వచ్చిన ‘హనుమాన్‌’ ఎంత ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీని తర్వాత జై హనుమాన్‌ కూడా రాబోతోంది. ఇప్పుడు తన యూనివర్స్‌ నుంచి మూడో సినిమాను ప్రకటించారు. ఆర్‌కెడి స్టూడియోస్‌ పతాకంపై రివాజ్‌ రమేష్‌ దుగ్గల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇండియాలోనే తొలి సూపర్‌ హీరోయిన్‌ మూవీగా రాబోతున్న ఈ సినిమాకి ‘మహాకాళి’ అనే టైటిల్‌ నిర్ణయించారు. ఈ చిత్రానికి ప్రశాంత్‌వర్మ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా, పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను దసరా కానుకగా విడుదల చేశారు. 

సామాజిక అంశాలను స్పృశిస్తూ, ఆధునిక సమస్యలతో కూడిన కథా నేపథ్యాన్ని కలిగి ఉంటుందని మేకర్స్‌ తెలిపారు. మహాకాళి కథ బెంగాల్‌ బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుంది. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో ఒక పులితో ఒక అమ్మాయి కనిపిస్తుంది. వెనుక భాగంలో గుడిసెలు, బంట్లు మరియు భయంతో పారిపోతున్న ప్రజలు, అందులోనే ఓ ఫెరిస్‌ వీల్‌ దగ్ధం అవుతున్నట్లు చూపించబడిరది. ఇది భారతీయ సాంప్రదాయాల ప్రతీకగా నిలిచిన దేవతగా మహాకాళిని చూపిస్తూ, వివక్ష, అంతర్గత బలాన్ని మరియు ఆత్మగౌరవాన్ని సాధించుకునే కథగా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా ఐమాక్స్‌ 3డి ఫార్మాట్‌లో కూడా విడుదల చేయబోతున్నారు.