English | Telugu

వార్ 2 ఫలితంపై తొలిసారి స్పందించిన హృతిక్ రోషన్.. తేలిగ్గా తీసుకోవద్దు

స్టార్ హీరోస్ హృతిక్ రోషన్,(Hrithik Roshanఎన్టీఆర్(Ntr)రీసెంట్ గా సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసిన చిత్రం 'వార్ 2'(War 2) .స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కగా, ఇండిపెండెన్స్ డే కానుకగా అగస్ట్ 14 న విడుదలై ఇద్దరి అభిమానులని అలరించింది. ప్రారంభంలో బాగానే కలెక్షన్స్ ని రాబట్టినా, రన్నింగ్ లో మాత్రం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదు. ఇండియా ఫస్ట్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కగా, కబీర్ క్యారక్టర్ లో హృతిక్ రోషన్, విక్రమ్ గా ఎన్టీఆర్ అద్భుతమైన పెర్ఫార్మ్ ని ప్రదర్శించారు.

రీసెంట్ గా హృతిక్ రోషన్ ఎక్స్(X)వేదికగా స్పందిస్తు 'కబీర్ క్యారక్టర్ ని చాలా సరదాగా పూర్తి చేశాను. నాకు ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తిగా తెలుసు కాబట్టి సులభం అనిపించింది. ఎవరికైనా నేను చెప్పేది ఒక్కటే. దేన్ని తేలిగ్గా తీసుకోకండి. ఒక నటుడిగా మీ బాధ్యతని వంద శాతం చెయ్యండి. మీ పనిని మీరు చేసే ఇంటికి వెళ్ళండి. ఈ సినిమాకి అదే చేశాను. ప్రతి సినిమా చేసేట్టప్పుడు విజయం సాధిస్తుందనే నమ్మకంతోనే చిత్రీకరిస్తాం. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎక్కడా రాజీపడకుండా,ప్రతి సన్నివేశాన్నిక్షుణ్ణంగా పరిశీలించి రూపొందించాడు.

ప్రతి సినిమాకి గాయలయ్యేలా పని చెయ్యాల్సిన అవసరం లేకుండా, నువ్వు చాలా సులభంగా చెయ్యగలవు. రిలాక్స్ గా పని చెయ్యి అనే ఆలోచనలు నా మైండ్ లోకి వస్తుండేవి అని ఎక్స్ వేదికగా తెలిపాడు. వార్ 2 రిలీజ్ తర్వాత హృతిక్ చేసిన తొలి పోస్ట్ ఇదే కావడం గమనార్హం. ఓటిటి వేదికగా అక్టోబర్ 9 నుంచి స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.