English | Telugu
లెక్చరర్ ప్రేమలో పడిన రాశి.. అతనికి పెళ్లయింది. అయినా..!
Updated : Dec 9, 2025
కొందరు హీరోయిన్లు తమ వ్యక్తిగత విషయాలను దాచిపెడుతూ ఉంటారు. ఎవరినైనా లవ్ చేశారా అని అడిగితే ఆ ప్రశ్నను దాటవేస్తారు. కొందరు మాత్రం ఆ విషయాలను చెప్పేందుకు మొహమాట పడరు. నిజాలు చెబితే తప్పేంటి అంటారు. అలా ఓ హీరోయిన్ తన ప్రేమ గురించి ఒక ఇంటర్వ్యూలో వివరంగా చెప్పింది. ఆ హీరోయిన్ పేరు రాశీ సింగ్.
ఆది సాయికుమార్ హీరోగా వచ్చిన ‘శశి’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైంది రాశీ సింగ్. ఆ తర్వాత ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’, ‘ప్రేమ్ కుమార్’, ‘ప్రసన్న వదనం’ వంటి సినిమాలతో అందర్నీ ఆకట్టుకుంది. ఇటీవల రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన ‘పాంచ్ మినార్’ చిత్రంలోనూ హీరోయిన్‌గా చేసింది. ఇటీవల ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకుంది.
‘కాలేజీలో చదువుకునే రోజుల్లో మా లెక్చరర్‌తో ప్రేమలో పడ్డాను. ఆయన చాలా స్మార్ట్‌గా ఉండేవారు. స్టడీ విషయంలో నాకు చాలా హెల్ప్ చేసేవారు. అంతేకాదు, వైవా సమయంలో నన్ను ఎలాంటి క్వశ్చన్స్ అడిగేవారు కాదు. ఇద్దరం రూమ్‌లో ఎంతో సరదాగా ఉంటూ కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అయితే మా ప్రేమలో హద్దులు దాటలేదు. ఆయనే నా ఫస్ట్ క్రష్. ఆయనకు ఆమధ్య పెళ్లయింది. అయినప్పటికీ నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతూనే ఉన్నారు’ అంటూ తన ఫస్ట్ లవ్ గురించి చెప్పుకొచ్చారు రాశీ. ఎంతో ఓపెన్‌గా ఆమె చెప్పిన లవ్‌స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.