English | Telugu

బిగ్‌బాస్‌ హౌస్‌లో గంగవ్వకు హార్ట్‌ ఎటాక్‌.. అందరూ షాక్‌!

ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 8లో అందర్నీ షాక్‌కి గురి చేసే ఘటన జరిగిందని, బిగ్‌బాస్‌ హౌస్‌లో గంగవ్వకు హార్ట్‌ ఎటాక్‌ వచ్చిందనే వార్త మీడియాలో బాగా స్ప్రెడ్‌ అయింది. ఈ వార్త ఎంతో వేగంగా వైరల్‌ అయిపోయింది. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనేది పరిశీలిస్తే.. ఇది కేవలం రూమర్‌ మాత్రమేనని తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే... ఈ సీజన్‌ లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో ఆరవ వారం వైల్డ్‌ కార్డు ద్వారా ఎనిమిది మంది మాజీ బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్స్‌ను హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వైల్డ్‌ కార్డు ద్వారా ఏంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లలో గంగవ్వ.. తనకు గుండె దడగా ఉందని చెప్పిందట. ఆ ఒక్క పాయింట్‌ని తీసుకొని గంగవ్వకు గుండెపోటు అంటూ ప్రచారం జరిగింది. వాస్తవానికి అక్కడ అలాంటి ఘటన ఏమీ జరగలేదని తెలుస్తోంది. గంగవ్వ పూర్తి ఆరోగ్యంగా, ఎంతో ఉత్సాహంగా ఉన్నారని సమాచారం అందుతోంది. వయసు మీద పడిన తర్వాత ఏ పనీ చెయ్యకుండా ఇంట్లోనే ఉంటూ ఉంటారు కొందరు వృద్ధులు. కానీ, అది తప్పు అని ప్రూవ్‌ చేసింది గంగవ్వ.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.