English | Telugu

'హనుమాన్' విడుదలకు ముహూర్తం ఖరారు!

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'హనుమాన్'. 'జాంబీ రెడ్డి' తరువాత తేజ సజ్జా-ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. భారీ బడ్జెట్ చిత్రాలను మించేలా విజువల్స్ ఉన్నాయనే ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఖరారైనట్లు సమాచారం.

మొదట 'హనుమాన్' సినిమాని మే 12న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే వీఎఫ్ఎక్స్ వర్క్ కి ఎక్కువ సమయం పడుతుండటంతో సినిమాని వాయిదా వేశారు. టీజర్ కి లభించిన స్పందనతో తమపై బాధ్యత ఇంకా పెరిగిందని, బెస్ట్ అవుట్ పుట్ తో అద్భుతమైన అనుభూతిని కల్గించాలన్న ఉద్దేశంతో మరింత సమయం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆ సమయంలో మేకర్స్ తెలిపారు. కొత్త విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు. అయితే తాజాగా విడుదల తేదీపై మేకర్స్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాని ఆగస్ట్ 25 న విడుదల చేయాలని నిర్ణయించారని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని వినికిడి. మరోవైపు అదేరోజున వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'గాండీవధారి అర్జున' విడుదల కానుంది.

'హనుమాన్' వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతున్నట్లు తెలుపుతూ తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా వేదికగా ఫోటోని పంచుకున్నారు. అందులో బాల హనుమాన్ బొమ్మ చూడముచ్చటగా ఉంది.

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న 'హనుమాన్' సినిమాలో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శివేంద్ర సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.