English | Telugu

సిద్దూ.. నీకు తెలుగోళ్లు ఎలా కనిపిస్తున్నారు..?

తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చి నువ్వొస్తానంటే నేనొద్దంటానా.? బొమ్మరిల్లు లాంటి సినిమాలతో తెలుగునాట అభిమానులను సంపాదించుకున్నాడు సిద్దార్థ్. ముఖ్యంగా యూత్ ఆడియన్స్‌లో మనోడి సినిమా వస్తుందంటే చాలు ఫుల్ క్రేజ్.. సరిగ్గా అలాంటి సమయంలో తెలుగు ప్రేక్షకుల మనసు నొచ్చుకునే ఒక మాట అన్నాడు సిద్దు. విభిన్నమైన సినిమాలను తెలుగువారు ఆదరించరు.. మూస సినిమాలనే ఇష్టపడుతుంటారు అన్న ఒకే ఒక్క మాటతో టాలీవుడ్‌కి దూరమైపోయాడు. తన సినిమాలు టాలీవుడ్‌లో అట్టర్‌ ఫ్లాపవ్వడంతో సిద్దార్థ్ తన కోపాన్ని అలా ప్రదర్శించాడు. ఈ మధ్యకాలంలో సిద్దూ నటించిన సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి.. కనీసం విడుదలైన విషయం కూడా ఎవరికీ తెలియదు.

అలాంటి సిద్దార్థ్ నటించిన గృహం తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హారర్ కామెడీ ట్రెండ్ నడుస్తున్న ఈ టైంలో పూర్తిస్థాయి హార్రర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాను మనోళ్లు బాగా రీసివ్ చేసుకున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత హిట్ దక్కడంతో సిద్దూ పండగ చేసుకుంటున్నాడు. అయితే తెలుగువాళ్లు కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయరంటూ అన్న ఆ నోటితోనే.. తనకు హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు సిద్దూ. కానీ దీనిని కొంతమంది సినీ జనాలు తప్పపడుతున్నారట. సినిమాలు చూడకపోతేనేమో చెడ్డవారు.. చూస్తేనేమో తెలుగోళ్లు మంచివాళ్లా అని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నో ఏళ్ల తర్వాత హిట్ రావడంతో సిద్ధార్థ్ గాల్లో తేలిపోతున్నాడు.