English | Telugu

ఫిబ్రవరి 24 న హీరో గోపీచంద్ పెళ్ళి

ఫిబ్రవరి 24 న హీరో గోపీచంద్ పెళ్ళి జరుగనుంది. వివరాల్లోకి వెళితే ప్రముఖ దర్శకులు టి.కృష్ణ కుమారుడు ప్రముఖ తెలుగు యువ హీరో గోపీచంద్ కి ఎట్టకేలకు పెళ్ళి కుదిరింది. అది కూడా పెద్దలు కుదిర్చిన అమ్మాయినే మన హీరో గోపీచంద్ పెళ్ళి చేసుకోబోతున్నాడు. గోపీచంద్ పెళ్ళి మీద అనేక పుకార్లు షికార్లు చేసిన నేపథ్యంలో చివరికి వాటన్నిటికీ తెరదించేస్తూ గోపీచంద్ పెళ్ళి హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె హరితతో ఫిబ్రవరి 24 వ తేదీన అత్యంతవైభవంగా జరుగనుంది.

హరిత హైదరాబాద్ లో ఇంజినీరింగ్ చదివి, ఆస్ట్రేలియాలో యమ్.బి.ఎ.చేసింది. గొపీచంద్ ఇప్పటికే తన పెళ్ళి శుభలేఖలను ముఖ్యమైన వారికి పంచటం కూడా మొదలైందని తెలిసింది. సినిమా "మొగుడు" నిజజీవితంలో కూడా మొగుడవుతున్నందుకు గోపీచంద్ ని అభినందించాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.