English | Telugu

'గోపాల గోపాల' కలెక్షన్ల వివరాలు

వెంకటేష్, పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ 'గోపాల గోపాల'మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే వచ్చిన రెండో రోజు ఆదివారం నుంచి కలెక్షన్స్‌ డ్రాప్ అయ్యాయని ట్రేడ్ వర్గాల సమాచారం. తొలిరోజు రూ.9 కోట్లకుపైగా షేర్ రాబట్టిన గోపాల.. రెండో రోజు రూ.4 కోట్లకుపైగా మాత్రమె వసూలు చేసిందట. అయితే ఈ సినిమా ఓవరాల్ గా నలభై కోట్లా క్లబ్ లో చేరుతుందా లేదా అనేది నిర్మాతల సందేహం. ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్ల వివరాలు ఇలా వున్నాయి.

నైజాం రూ. 4 కోట్ల 61 లక్షలు
సీడెడ్ రూ. 2.30 కోట్లు
ఈస్ట్ గోదావరి రూ.1. 47 కోట్లు
గుంటూరు రూ. 1. 34 కోట్లు
ఉత్తరాంధ్ర రూ. 1. 32 కోట్లు
వెస్ట్ గోదావరి రూ. 1. 02 కోట్లు
కృష్ణా రూ. 97 లక్షలు
నెల్లూరు రూ.45 లక్షలు
ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ కలిపి కలెక్షన్ షేర్ రూ.
13 కోట్ల 48 లక్షలు

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.