English | Telugu

గోపాలా గోపాలాతో ‘ఐ’ పోటీ పడగలదా?

శంకర్ దర్శకత్వం వహించిన ‘ఐ’ సినిమా సంక్రాంతి పండుగకు విడుదల అవుతోందని తెలిసి కూడా పవన్ కళ్యాణ్, వెంకటేష్ నటించిన ‘గోపాల గోపాల’ సినిమా విడుదల చేయడం తెలివి తక్కువ పనే అని దర్శకుడు రామ గోపాల్ వర్మ ట్వీట్ చేసాడు. అంతే కాక ‘ఐ’ సినిమా విడుదలయితే పాపం పీకే (అంటే పవన్ కళ్యాణ్) పనేమవుతుందోనని పవన్ కళ్యాణ్ మీద అతను బోలేడంత జాలి కూడా కురుపించేసాడు. కానీ ఇప్పుడు ఆ రెండు సినిమాల కలెక్షన్లు చూసినట్లయితే తన అభిప్రాయం మార్చుకోక తప్పదు.

రెండు సినిమాలు రెండుర్ రాష్ట్రాలలో కూడా ఇంచుమించు సరిసమానమయిన కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకుపోతున్నాయి. గోపాల గోపాల సినిమా ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలలో కలిపి మొదటి నాలుగు రోజులలో రూ.17.81 కోట్లు వసూలు చేయగా, ఐ సినిమా నెగెటివ్ టాక్ మూటగట్టుకొన్నప్పటికీ మొదటి రోజు ఏడు కోట్ల వరకు వసూలు చేసిందిట. కానీ పండుగ హడావుడితో బాటే ఐ కలెక్షన్లు కూడా తగ్గుముఖం పట్టవచ్చని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ఎందువలన అంటే అద్బుత ప్రతిభ కలిగిన శంకర్ ఐ సినిమాను ఏవిధంగా నిర్మించారో చూద్దామని వెళ్ళినవారే ఎక్కువ తప్ప ఆ సినిమా బాగుంటుందనే ఉద్దేశ్యంతో వెళ్ళేవారు తక్కువే. కానీ పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి నటించిన గోపాల గోపాల సినిమాకు మొదటి రోజునుండే మంచి టాక్ రావడమే కాకుండా అచ్చతెలుగు సినిమా కావడం అన్ని వర్గాలను ఆకట్టుకొనే విధంగా మంచి వినోదం అందిస్తుండటం కారణంగా ఆ సినిమాకే తెలుగు ప్రేక్షకులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అయితే శంకర్ ఐ సినిమాను ఏ మాత్రం తక్కువ అంచనా వేయడానికీ లేదు. శంకర్ దర్శకత్వ ప్రతిభను చూసేందుకు అయినా అందరూ ఒక్కసారి ఆ సినిమాను చూడటం ఖాయం కనుక ఆ సినిమా గోపాలా గోపాలా సినిమా అంత కాకపోయినా బాగానే కలెక్షన్లు రాబట్టుకోవచ్చును. కాకపోతే తెలుగు ప్రేక్షకులు గోపాలా గోపాలా సినిమాకు మళ్ళీ మళ్ళీ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గనుక దానితో కలెక్షన్ల విషయంలో ఐ సినిమా పోటీ పడలేదని చెప్పవచ్చును.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.