English | Telugu

గంగవ్వ పై పోలీసు కేసు..ఇది వాళ్ళ పనే 

యూట్యూబ్ లో అప్ లోడ్ అయ్యే పలు వీడియోలు ద్వారా విశేష కీర్తిని సంపాదించిన యూ ట్యూబర్ గంగవ్వ.ప్రస్తుతం బిగ్ బాస్ లాంటి ప్రతిష్టాత్మక షో లో కూడా పాల్గొంటూ ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తుంది.

మే 20 2020 న యూట్యూబ్ లో మై విలేజ్ షో అనే ప్రోగ్రాం లో గంగవ్వ చెప్పిన పంచాంగం వీడియో ఒకటి అప్ లోడ్ అయ్యింది. ఇంకో యూట్యూబర్ రాజు తో కలిసి గంగవ్వ ఆ వీడియో చేసింది.కాకపోతే అందులో చిలుకని ఉపయోగించి గంగవ్వ పంచాంగం చెప్పింది. దీంతో జ్యోతిష్య ప్రయోజనాల కోసం చిలుకని ఉపయోగించడం వన్య ప్రాణుల రక్షణ చట్టం ఉల్లగించడం కిందకి వస్తుందని జగిత్యాల అటవీ శాఖలో జంతు సంరక్షణ కార్యకర్త గా పని చేస్తున్న అదులాపురం గౌతమ్ పోలీసులకి ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు గంగవ్వపై కేసు నమోదు చేసారు.


రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.