English | Telugu
పవన్ కి గణేష్ కాస్ట్లీ గిఫ్ట్
Updated : May 30, 2012
పవన్ కి గణేష్ కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తున్నాడట. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష్ హీరోయిన్ గా గతంలో బండ్ల గణేష్ నిర్మించిన "తీన్ మార్" చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అందుకని హీరో పవన్ కళ్యాణ్ అంతా తానే అయి "గబ్బర్ సింగ్" చిత్రాన్ని గణేష్ కోసం చేసిపెట్టాడు. ఈ చిత్రం సూపర్ హిట్టయ్యింది.
ఆ ఆనందంతో గణేష్ జూబ్లీ హిల్స్ ఏరియాలో సకల ఆధునిక సౌకర్యాలతో ఉన్న రెండు కోట్లు ఖరీదు చేసే ఒక కాస్ట్లీ ఫ్లాట్ ని హీరో పవన్ కళ్యాణ్ కోసం బహుమతిగా కొన్నాడట. ఆ బహుమతిని హీరో పవన్ అంగీకరిస్తాడో లేదో వేచి చూడాలి...! ప్రస్తుతం యన్ టి ఆర్ హీరోగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో, "బాద్ షా" చిత్రాన్ని నిర్మిస్తున్నాడు గణేష్. ఈ చిత్రం పూర్తయ్యాక మళ్ళీ పవన్ కళ్యాణ్ హీరోగా మరో చిత్రాన్ని నిర్మించాలనే ప్రయత్నంలో ఉన్నాడు గణేష్.