Read more!

English | Telugu

ఫ్యామిలీ స్టార్ ఓటిటి డేట్ ఫిక్స్.. కానీ వాళ్ళకి లేదు 

తెలుగు నాట మండే ఎండలని చల్లబరచడానికి విజయ్ దేవరకొండ(vijay devarakonda)  వచ్చేస్తున్నాడు. ఇక మీరు ఎండల నుంచి ఉపశమనం పొందినట్టే. ఎందుకు ఇంతా ధీమాగా చెప్తున్నానంటే ఫ్యామిలీ స్టార్ మీ ఇంట్లోకి అడుగుపెట్టబోతుంది. ఎప్పుడు ఎలాగో చెప్తాను. 

ఫ్యామిలీ స్టార్ (family star)  ఓటిటి డేట్ ఫిక్స్ అయ్యింది. అమెజాన్  ప్రైమ్ ద్వారా  ఏప్రిల్ 26న  రిలీజ్ కాబోతుంది. ఈ మేరకు  అఫీషియల్ గా ప్రకటన కూడా వచ్చింది.  తెలుగు ప్రేక్షకులతో  పాటు  తమిళ, మళయాళ, కన్నడ ప్రేక్షకులని కూడా పలకరించనుంది.దీంతో మండే ఎండల నుంచి ఉపశమనం దక్కినట్టే.  కాకపోతే   హిందీ ప్రేక్షకులు మాత్రం కొన్నిరోజులు ఆగాల్సిందే. విజయ్ ఫ్యాన్స్ అయితే   ఏప్రిల్ 26 కోసం ఫుల్ వెయిటింగ్


ఏప్రిల్ 5 న థియేటర్స్ లోని వచ్చిన ఫ్యామిలీ స్టార్ కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్టుగా పరాజయాన్నిచవి చూసింది. కలెక్షన్లు కూడా పెద్దగా రాబట్టుకోలేదు.  విజయ్ దేవరకొండ  సరసన మృణాల్ ఠాకూర్ జత కట్టింది. ఇద్దరి ఫెయిర్ కి మాత్రం  ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే  పడ్డాయి. జగపతి బాబు, వాసుకి, అజయ్ ఘోష్, తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. గోపి సుందర్ సంగీతాన్ని అందించగా దిల్ రాజు  నిర్మాతగా వ్యవహరించాడు. పరశురామ్ దర్శకుడు