English | Telugu

మరో వివాదంలో డింపుల్ హయాతి.. ఒడిశా నుండి యువతులను తీసుకొచ్చి...

సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ వార్తల్లో నిలుస్తుంటుంది హీరోయిన్ డింపుల్ హయతి. తాజాగా ఆమె మరో వివాదంలో చిక్కుకుంది. ఒడిశాకు చెందిన ఇద్దరు యువతులను ఇంట్లో పనిని పెట్టుకొని.. డబ్బులు ఇవ్వకపోగా, చిత్ర హింసలకు గురి చేసినట్లు ఆరోపణలు వస్తాయి. వారిని వివస్త్రను చేసి దాడి చేయడానికి, వీడియోలు తీయడానికి ప్రయత్నించారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. (Dimple Hayathi)

డింపుల్ హయాతి, ఆమె భర్త తమ ఇంటి పనులు మరియు పెంపుడు కుక్కలను చూసుకోవడానికి ఇద్దరు మనుషులు కావాలని ఒక పరిచయస్తురాలికి చెప్పారట. దీంతో ఆమె ఒడిస్సా నుండి ఇద్దరు యువతులను రప్పించి.. డింపుల్ హయాతి ఇంటికి పంపించింది. డింపుల్ దంపతులు కొన్ని రోజులు వారిని బాగానే చూసుకున్నారట. ఆ తర్వాత ఆ యువతులకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా.. సడెన్ గా బయటకు వెళ్ళిపోమన్నారట. దీంతో ఆ యువతులు అపార్ట్మెంట్ దగ్గర ఆందోళనకు దిగగా.. డింపుల్ దంపతులు బెదిరింపులకు పాల్పడ్డారట. మాకు చాలా మంది లాయర్లు తెలుసు, మీ దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరించారట. అంతేకాకుండా, ఆ యువతులను హైదరాబాద్ కి తీసుకువచ్చిన మహిళపై కూడా డింపుల్ దంపతులు ఫైర్ అయ్యారట.

దీంతో ఆ ఒడిశా యువతులు ఫిల్మ్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. తమతో వెట్టి చాకిరీ చేపించుకొని.. డబ్బులు ఇవ్వకపోగా, బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగ్నంగా చేసి దాడి చేయడానికి, వీడియోలు తీయడానికి కూడా ప్రయత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. మరి డింపుల్ హయాతి దంపతులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.